దానం నాగేందర్ టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి తిరిగి చేరనున్నారన్న ప్రచారంపై దానం స్పందించారు. దీనిపై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరక్క సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ వీడడం అనేది పెద్ద జోక్ అన్నారు. ఎలాంటి షరతులు లేకుండానే టిఆర్ఎస్ పార్టీలో చేరానని చెప్పారు. తన టికెట్ విషయం అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.
వాట్సప్ మెసేజెస్ చూసి ఎమోషనల్ అయ్యే నేతను కాను అంటూ చురకలు వేశారు. కెసిఆర్ ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుని పార్టీని గెలిపించి బహుమతిగా అందిస్తా అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎలా ఉండబోతుందో త్వరలో చూస్తారని ఎద్దేవా చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి గులాబీ జెండా ఎగురుతదన్నారు. కాంగ్రెస్ నేతలు త్వరలోనే సన్యాసం తీసుకునేందుకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ నగరంలో ఎక్కడ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తా అని తేటతెల్లం చేశారు. దానం నాగేందర్ మాట్లాడిన వీడియో లింక్ కింద ఉంది చూడొచ్చు.