సీఎం కేసీఆర్ యాదాద్రిని సందర్శించారు. బేగంపేట నుంచి హెలికాప్టర్ లో యాదాద్రికి చేరుకున్న కేసీఆర్ ముందుగా ఆలయ భాగమంతా ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత ఆయన బాలాలయంలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు కేసీఆర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం అందజేశారు.
అనంతరం ఆయన ఆలయ అధికారులతో మాట్లాడి నిర్మాణ పనుల పై సమీక్షించారు. బ్రహ్మోత్సవాల నాటికి అన్ని పనులు పూర్తి కావాలన్నారు. ఆలయ నిర్మాణ పనుల పై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. 15 నెలల తర్వాత కేసీఆర్ యాదాద్రికి వచ్చారు. కేసీఆర్ వెంట ఎంపీ సంతోష్ కుమార్, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడిసునీత, గాదరి కిషోర్, సీఎంవో అధికారి భూపాల్ రెడ్డి, వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఉన్నారు. కేసీఆర్ పూజల్లో పాల్గొన్న వీడియో కింద ఉంది చూడండి.