కేసీఆర్ మౌనం.. ఎమ్మెల్యేల ఎరలో తప్పు చేసింది ఎమ్మెల్యేలేనా?

ముగ్గురు వ్యక్తులు తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభానికి గురి చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. మొదట ఇందుకు సంబంధించి బీజేపీపై ఆరోపణలు చేసిన కేసీఆర్ ప్రస్తుతం మౌనం వహిస్తున్నారు. ఈ అంశం గురించి మాట్లాడవద్దని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచనలు చేశారని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. అయితే తెరాస ఎమ్మెల్యేల తప్పు ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ రీజన్ వల్లే కేసీఆర్ సైలెంట్ అయ్యారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నిక మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ఆధారాలతో సహా బయటపెట్టి ఉంటే బీజేపీకి మైనస్ అయ్యి ఉండేది. పలు సర్వేలలో దాదాపు 50 శాతం మంది ఓటర్లు మునుగోడులో బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. 30 శాతం ఓటర్లు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు.

టీ.ఆర్.ఎస్ పార్టీ ఆలస్యంగా రియాక్ట్ అయ్యి బీజేపీపై కామెంట్లు చేసినా పెద్దగా ఫలితం అయితే ఉండదు. నెత్తిమీద రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా కొనని నేతలను 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఎందుకు కొంటామంటూ బీజేపీ నేతలు కామెంట్లు చేస్తుండటం గమనార్హం. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించడం గమనార్హం.

ఓటుకు నోటు కేసు బయటికొచ్చిన సందర్భంలో కేసీఆర్ సర్కార్ ఏ స్థాయిలో రచ్చ చేసిందో తెలియనిది కాదు. ఒక్కో ఎమ్మెల్యే కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఏ పార్టీకి లేదు అనే సంగతి తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి రాబోయే రోజుల్లో మరికొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది.