కేసీఆర్ మినీ కేబినేట్ లో వీరికే చాన్స్

తెలంగాణ కొత్త శాసనసభ జనవరి 17 న కొలువు తీరనుంది.  ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇంతకాలం ఉత్కంఠగా ఎదురు చూసిన వారికి కేబినేట్ కూర్పు పై ఓ అంచనా వచ్చింది. అయితే మిని కేబినేట్ లో ఎవరెవరు ఉంటారన్న చర్చ మాత్రం జోరందుకుంది. 

పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారికే పదవులు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. గతంలో మంత్రులుగా చేసిన ఐదారుగురికి ఈ సారి అవకాశం దక్కక పోవచ్చన్న చర్చ జరుగుతోంది. కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. సామాజిక వర్గాల వారీగా మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. సామాజిక వర్గంగా కూర్పు చేయడమే కష్టంగా మారడంతో కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. 

మిని కేబినేట్ లో కేటిఆర్ కు అవకాశం ఇవ్వవద్దని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. కేటిఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఆయనకు సవాల్ గా మారాయి. మంత్రి వర్గంలోకి తీసుకుంటే పార్టీకి, ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పని చేయలేరనే ఉద్దేశ్యంతో కేటిఆర్ ను కేబినేట్ లోకి తీసుకోవద్దనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికల తర్వాత మలి విడతలో కేటిఆర్ ను కేబినేట్ లోకి తీసుకుంటారని తెలస్తోంది. 

 

తెలంగాణ మిని కేబినేట్ లో స్థానం దక్కే అవకాశం ఉన్న అభ్యర్దులు వీరే

తెలంగాణ కేబినేట్ కూర్పులో సీఎం కేసీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి కేబినేట్ లో దాదాపు 8 లేదా 9 మంది కొత్తవాళ్లకు కేసీఆర్ అవకాశం కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన హారీష్ రావుకు మొదటి విడతలోనే స్థానం ఖరారైనట్టు తెలుస్తోంది. గతంలో కూడా పని చేసిన వారికే ఉన్నత పదవులు వస్తాయని కేసీఆర్ చెప్పారు. మిని కేబినేట్ లో వీరి పేర్లు ఉండవచ్చని తెలుస్తోంది. వారు ఎవరెవరంటే…

హరీష్ రావు 

జగదీశ్వర్ రెడ్డి

కడియం శ్రీహారి

పద్మారావు గౌడ్

తలసాని శ్రీనివాస్ యాదవ్

దానం నాగేందర్

వేముల ప్రశాంత్ రెడ్డి

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పల్లా రాజేశ్వర్ రెడ్డి

ఎర్రబెల్లి దయాకర్ రావు

వీరిలో కేబినేట్ లో చాన్స్ సంపాదించుకునే ఆ 8 మంది ఎవరనే ఉత్కంఠ మొదలయింది.  మరీ సీఎం కేసీఆర్ ఎవరిని తన టిం మెంబర్లుగా ఎంచుకుంటారనేది చూడాలి.