తెలంగాణ ప్రజలకు దూరమవుతున్న సీఎం కేసీఆర్.. మీకు అర్థమవుతోందా?

తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రజలకు దూరమవుతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం విషయంలో తెలంగాణ ప్రజలు ఒకింత అసంతృప్తితోనే ఉన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలలో సత్తా చాటడం కోసం ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు.

కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు నమ్మడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రజలు నమ్మిన విధంగా ఆయనను ఇతర రాజకీయ పార్టీలు నమ్ముతాయా అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తుంది. కేసీఆర్ కు మద్దతు ఇవ్వడానికి ఇతర రాష్ఱ్రాల రాజకీయ నేతలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. దేశంలో చాలా రాష్ట్రాలలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఈ పార్టీలను కాదని కేసీఆర్ జాతీయ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వడం అయితే సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణపై దృష్టి పెట్టడం మరిచి జాతీయ రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ కు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాల్సి ఉంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో సక్సెస్ సాధించాలని ఆయన సన్నిహితులు కోరుకుంటున్నారు. బీ.ఆర్.ఎస్ పార్టీ విషయంలో కేసీఆర్ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.

జాతీయ రాజకీయాలలో మోదీ స్థాయిలో మరెవరూ ప్రజల నమ్మకాన్ని పొందలేకపోతున్నారు. మోదీ హయాంలో ఖర్చులు పెరిగినా దేశానికి ఆయన వల్ల చాలా మేలు జరిగిందని ఎక్కువమంది భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సైతం పుంజుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాలలో ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.