మంగళవారం ఆర్ధరాత్రి సమయంలో ఖమ్మం నగర శివార్లలోని గణేష్ టౌన్ షిప్ కు చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లి తండ్రి హాస్పిటల్ కు తీసుకుపోయేందుకు రోడ్డు మీదకు వచ్చి వాహనాలు ఆపుతున్నారు. ఏ క్కరు కూడా ఆపలేదు. దీంతో తమ కూతురు బాధను చూసి ఆ తల్లిదండ్రులు నిరాశగా తల్లడిల్లుతున్నారు. అదే సమయంలో అక్కడికి పెట్రోలింగ్ వాహనం వచ్చింది.
అందులో ఉన్న ఖమ్మం అర్బన్ సీఐ సాయిరమణ విషయాన్ని గ్రహించి వాహనం ఆపాడు. వెంటనే తమ సిబ్బంది రాములు, రాంచందర్ ను అప్రమత్తం చేసి వారిని వాహనంలో ఎక్కించుకున్నాడు. హూటాహూటిన తన వాహనంలోనే ఖమ్మం టౌన్ లోని లుంబీని ఆస్పత్రికి తరలించారు. వాహనం వస్తున్నప్పుడే ఫోన్ చేసి వైద్యులను అప్రమత్తం చేసి సమాచారమిచ్చారు. దీంతో వారు వెంటనే ఆ గర్భీణి స్త్రీకి వైద్యం చేశారు. ఆస్పత్రికి వచ్చిన కాసేపటికే పండంటి మగబిడ్డ జన్మించాడని మహిళ తండ్రి సత్యనారాయణ అన్నారు. సఃకాలంలో స్పందించి తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడారంటూ వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.