డిస్మిస్ చేయండి జగన్ గారు.. ఇలాంటి సీఐ మనకు అవసరమా?

ఈ మధ్య కాలంలో రాజకీయ నేతలలో చాలామంది పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాలని సూచిస్తున్నారు. కొంతమంది పోలీసులు సైతం ప్రజలతో ఫ్రెండ్లీగానే ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తుండటం గమనార్హం. అయితే అతికొద్ది మంది పోలీసులు జగన్ సర్కార్ పేరుప్రతిష్టలకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం గమనార్హం. శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ఒక మహిళ విషయంలో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో కూడా సీఐ అంజూ యాదవ్ పై పలు ఆరోపణలు వ్యక్తం కాగా తాజాగా చిరు బండి నిర్వహిస్తున్న మహిళా వ్యాపారిపై సీఐ దారుణంగా ప్రవర్తించారు. మహిళపై సీఐ విచక్షణారహితంగా దాడి చేయగా అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వ్యక్తిగత కక్షతో అంజూ యాదవ్ మహిళను టార్గెట్ చేసి చిత్రహింసలకు గురి చేశారని సమాచారం అందుతోంది.

ఈ ఘటన విషయంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ప్రజలను రక్షించాల్సిన రక్షక భటులే ఈ విధంగా సామాన్యులను హింసించడం ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ సీఐను డిస్మిస్ చేయాలని అప్పుడే ఈ తరహా ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా సీఐలు ఉండటం వల్ల ప్రజలకు మంచి కంటే చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

అంజూ యాదవ్ లాంటి పోలీసుల వల్లే పోలీసులపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడుతోంది. ఎస్పీలు కూడా ఈ తరహా సీఐల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఈ తరహా ఎస్సైల విషయంలో కఠినంగా ఉంటే మాత్రమే ప్రజల్లో పోలీసులపై మంచి అభిప్రాయం కలుగుతుంది. అంజూ యాదవ్ ఈ ఘటన గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.