కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, టిఆర్ ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ని మీడియా సమావేశంలో కమలాకర్ చంపుతానంటూ బహిరంగంగా బెదిరించారు. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బిడ్డా రాజకీయం పక్కన పెడితే నిన్ను వేయడానికి ఒక్క నిమిషం పట్టదు ఏమనుకుంటున్నావో అని కమలాకర్ బండి సంజయ్ ని బెదిరించారు. ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని సప్పుడుగాక కూర్చుంటే నన్ను గెలుకుతావ్.. రాజకీయాలు పక్కన పెడితే నీవు ఔటే అంటూ గంగుల కమలాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీని పై ఈసీకి ఫిర్యాదు అందడంతో ఈసీ ఆదేశాలతో కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గంగుల మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.