కాంగ్రెస్, టిఆర్ఎస్ పై బిజెపి కీర్తిరెడ్డి ఫైర్ (వీడియో)

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గట్టిగానే పట్టు బిగిస్తున్నది. అటు టిఆర్ఎస్, ఇటు మహా కూటమి లలో అసంతృప్తులకు గాలమేస్తూ హల్ చల్ చేస్తున్నది. మరోవైపు పార్టీలో బలమైన నేతలను ఇప్పటికే ఎన్నికల బరిలోకి దింపింది. భూపాలపల్లిలో డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డిని బరిలోకి దింపింది బిజెపి. కీర్తిరెడ్డి ఎన్నికల కంటే ముందే నియోజకవర్గంలో పనిచేస్తూ పోతున్నారు. గ్రామాల్లో నిత్యం తిరుగుతూ జనాల మంచి చెడుల్లో భాగస్వామి అయ్యారు. ఆపదలో ఉన్నవారిని పరామర్శిస్తున్నారు. 

భూపాలపల్లిలో టిఆర్ఎస్ పార్టీ తరుపున స్పీకర్ మధుసూదనాచారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి బరిలో ఉన్నారు. వీరిద్దరి మధ్యే బలమైన పోటీ ఉంటుందని అనుకునేలా లేకుండా చేశారు డాక్టర్ కీర్తిరెడ్డి. గత రెండేళ్లుగా కీర్తి రెడ్డి నిత్యం జనాల్లో తిరుగుతూ తనకు మాంచి ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. 

దీంతో నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉండబోతుందన్న వాతావరణం నుంచి ట్రై యాంగిల్ ఫైట్ తప్పదన్న స్థాయి నెలకొంది. కీర్తిరెడ్డికి భూపాలపల్లిలో పనిచేసుకోవాలని బిజెపి నాయకత్వం ఎప్పుడో ప్రకటించింది. సీటు ఆమెకే ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో కీర్తి రెడ్డి ప్రచారం లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ లకు ధీటుగా ఆమె ప్రచార సరళి కొనసాగుతున్నది.

డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి శుక్రవారం సాయంత్రం మొగుళ్లపల్లి మండలం లోని పోతుగల్ ఇప్పలపల్లి గ్రామల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగలహారథులతో కోలాటాలతో ఆమెకు స్వాగతం పలికారు. గ్రామస్తులతో కీర్తి రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పట్ల మహిళలు విద్యార్థులు యువకులు మద్దతు తెలపడం, ఆసక్తి చూపడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ దేశ ప్రజల కొరకు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను నేడు ప్రజలు గుర్తించడం చాలా సంతోషమని తెలిపారు.

keerthi reddy bjp

 

కానీ నేడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవరిస్తూ ప్రజల సమస్యలను పక్కన పెట్టి తమ స్వలాభం కొరకు ఆలోచిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే కాలం ఆసన్నమైందని ఇక తెరాస కాంగ్రెస్ నాయకులకు చెందిన నాయకులు గ్రామాలలో తిరిగే పరిస్థితి లేదని హెచ్చరించారు.  నియోజకవర్గ ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల, తమ పట్ల చూపిస్తున్న అమితమైన ప్రేమ కు ఎంతో కృతజ్ఞతులమని నియోజకవర్గంలో కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి గెలిపించి తమని నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని కల్పించాలని కోరారు .అనంతరం గ్రామానికి చెందినటువంటి పలువురు యువకులు మహిళలు కీర్తిరెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు.