కాంగ్రెస్ నేత గండ్ర పై లైంగిక వేధింపుల కేసు? (వీడియో)

కాంగ్రెస్ హయాంలో కీలక నేతగా వ్యవహరించిన మాజీ చీఫ్ విప్, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. నాలుగేళ్లుగా తనను శారీరకంగా వాడుకొని ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఆరోపించింది. అసలీ గండ్ర వెంకట రమణ కథేంటో మీరే చదవండి.

విజయలక్ష్మీ

గండ్ర వెంకటరమణారెడ్డి తనను మోసం చేశాడంటూ విజయలక్ష్మీ అనే యువతి ఆరోపిస్తుంది. ఇంకా విజయలక్షీ పలు ఆరోపణలు చేశారు అవి ఆమె మాటల్లో “గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు. అప్పుడే నాకు గండ్ర వెంకటరమణా రెడ్డికి మధ్య పరిచయం ఏర్పడింది. మాది పస్రా ప్రాంతం. 13 ఏళ్లుగా నేను స్వచ్చంద సంస్థ నిర్వాహకురాలిగా పని చేస్తున్నాను. గండ్ర గారితో ఉన్న పరిచయం శారీరక సంబంధానికి దారి తీసింది. నాలుగు సంవత్సరాలుగా మేము కాపురం చేస్తున్నాం. ఆయనకు చెందిన జీఎంఆర్ ఫంక్షన్ హాల్ లో, అతని ఇంట్లో అనేక సార్లు కలిశాం.

గండ్ర ఇంటి ముందు ధర్నా చేస్తున్న  బాధితురాలు విజయలక్ష్మీ

ఇప్పుడు తన అవసరం తీరాక నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. నేనేవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నాడు. పత్రికల్లో తనపై తప్పుడు కథనాలు రాయించి నా బతుకును నాశనం చేశాడు. ఈ విషయమై తనను అడగాడిని వెళితే ఎవరు నువ్వు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని తన మనుషులతో ఇంట్లో నుంచి బయటకు గెంటి వేయించాడు. సుబేధారి పోలీసు స్టేషన్ లో తనపై న్యూసెన్స్ కేసు పెట్టించి నన్ను అరెస్టు చేయించాడు. గండ్ర పెద్ద మోసగాడు. నా దగ్గర ఆధారంగా ఉన్న రెండు సెల్ ఫోన్లు పోలీసులు లాక్కున్నారు. తప్పు చేసిన అతన్ని వదిలి నన్ను దోషిగా పోలీసులు చిత్రీకరించారు. సమాజంలో పలుకుబడి ఉన్న నేతలతో ఎందుకు పెట్టుకుంటున్నావని పోలీసులు తనపై ఎదురు దాడికి దిగారు. గండ్ర నాకు చేసిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలన్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. ఆధారాలన్ని పోలీసుల చేతిలో ఉన్నాయని తనకు ఎలాగైనా న్యాయం చేయండి” అంటూ బాధితురాలు విజయలక్ష్మీ వాపోయింది. విజయలక్ష్మీ ఫిర్యాదు స్వీకరించని పోలీసులు విషయం బయటకు పొక్కడంతో గండ్ర వెంకటరమణా రెడ్డి పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.