హన్మకొండలో సెల్ టవరెక్కిన గండ్ర అభిమాని (వీడియో)

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డి. విజయలక్ష్మి అనే మహిళ గండ్రపై లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించారు. గండ్ర తనను నాలుగేళ్లుగా శారీరకంగా వాడుకున్నారని ఆరోపించారు. అంతేకాదు ఆమె గండ్ర నివాసం వద్ద ధర్నా కూడా చేశారు. 

అయితే తనపై విజయలక్ష్మి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు గండ్ర వెంకటరమణారెడ్డి. ఆయనే కాదు ఆయన సతీమణి గండ్ర జ్యోతి కూడా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులు తన ప్రతిష్ట దిగజార్చేందుకు మహిళను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా ఆయన హైదరాబాద్ లో విజయలక్ష్మి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా గండ్రపై లైంగిక విమర్శలు రావడాన్ని జీర్ణించుకోలేని ఆయన అభిమాని పూసల యుగేంద్రచారి హన్మకొండలో సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. హన్మకొండలోని ప్రెస్ క్లబ్ వద్ద సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశారు. రాజకీయంగా గండ్రను ఎదుర్కోలేక చౌకబారు విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. 

సెల్ టవర్ ఎక్కిన యుగేంద్ర చారి ఏం మాట్లాడుతున్నారో కింద వీడియోలో ఉంది చూడండి.