కేసీఆర్ ను భయపెట్టడమే బండి సంజయ్ లక్ష్యమా?

bandi sanjay

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో గత కొన్నిరోజులుగా కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఉపఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో సాధారణ ప్రజలు పెద్దగా ఆశ్చర్యపోలేదు. అయితే రాబోయే రోజుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయనున్నారని బండి సంజయ్ బాంబు పేల్చారు.

ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారని బండి సంజయ్ చెప్పడంతో ఆ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జరుగుతోంది. అయితే అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం జరిగే పని కాదు. కేసీఆర్ ను భయపెట్టాలనే ఆలోచనతోనే బండి సంజయ్ ఇలాంటి కామెంట్లు చేశారని అంతకుమించి మరేం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ తలచుకుంటే ఇతర పార్టీ నేతలను టీ.ఆర్.ఎస్ లోకి తీసుకోవడం కష్టమేమీ కాదు. బండి సంజయ్ ఇదే విధంగా రెచ్చగొడితే బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరే దిశగా కేసీఆర్ అడుగులు వేసే ఛాన్స్ ఉంది. రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ, టీ.ఆర్.ఎస్ పార్టీలు అడుగులు వేస్తుండటం గమనార్హం. తెలంగాణలో బీజేపీ బలం పెరిగినా టీ.ఆర్.ఎస్. ను అభిమానించే వాళ్ల సంఖ్య కూడా తక్కువగా లేదు.

కేసీఆర్ సర్కార్ ఇతర పథకాలతో సంబంధం లేకుండా రైతులకు బెనిఫిట్ కలిగేలా అమలు చేస్తున్న రైతు బంధు పథకం అధికార పార్టీ ఇమేజ్ ను పెంచింది. బండి సంజయ్ కామెంట్ల విషయంలో కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. సర్వేల ఫలితాలు సైతం 2024 ఎన్నికలలో కేసీఆర్ సర్కార్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నాయి.