Auto Drivers: ప్రస్తుతం ప్రతి ఒక్క వస్తువు ధర భగ్గుమంటున్నాయి. అన్ని రంగాలలో ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. పైగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగటంతో ఆటో ఛార్జీలు పెంచమని తాజాగా ఆటో డ్రైవర్ లు రంగంలోకి దిగారు. ఎనిమిదేళ్ల నుంచి ఆటో ధరల సవరణ లేకపోవటంతో ఈ విషయం రవాణా శాఖ దృష్టికి చేరింది.
నిజానికి ప్రస్తుతం ఆటోలలో మీటర్లు వేసి ఆటో నడిపించడం లేదు. దీంతో ఇదివరకే చార్జీలను పెంచి అలాగే కొనసాగిస్తున్నారు. ఒకవేళ ధరలను పెంచినట్లయితే మీటర్ రూపంలోనే ధరలు పెంచవచ్చు. ప్రస్తుతం ఆటో ఛార్జ్ రూ.20 ఉంటే 40 రూపాయలు చేయనున్నట్లు తెలుస్తుంది. 1.6 కిలోమీటర్ తర్వాత ప్రతి కిలో మీటర్ కు రూ.25 కు చేయనున్నట్లు తెలుస్తోంది.