ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల చాలా మంది డిజిటల్ పేమెంట్స్ కి అలవాటు పడి మొబైల్ ఫోన్ ద్వారానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకుకు వెళ్లి డబ్బులు డ్రా చేయటం లేదా ఏటీఎం కి వెళ్లి డబ్బులు డ్రా చేసే వారి సంఖ్య చాలా వరకు తగ్గింది. కానీ ఇప్పటికీ కొంతమంది ప్రజలు డిజిటల్ పేమెంట్స్ కి బదులు ఏటీఎం ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే ఇలా ఏటీఎం సేవలో వినియోగించుకున్నందుకు ప్రతి ఖాతాదారుడు బ్యాంకుకు కొంత మోత్తం లో బ్యాంక్ కి చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ప్రస్తుతం ఏటీఎం ద్వారా సేవలు అందిస్తున్నందుకు ఆయా బ్యాంకులు చార్జీలు పెంచాయి. నిర్దిష్ట సంఖ్య దాటిన లావాదేవీలపై బ్యాంకులకు సర్వీస్ చార్జీలు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఆయా బ్యాంక్ ఖాతాలను బట్టి ఏటీఎం చార్జీలు నిర్ణయించబడ్డాయి. ఏయే బ్యాంకులు తమ ఏటీఎంలపై చార్జీలు పెంచాయో చూసేద్దాం..
1. ఎస్బీఐ
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్బిఐ) ఖాతాదారులు ఆ బ్యాంక్ సంబంధిత ఏటీఎంలలో నెలకు 5 సార్లు డబ్బులు రాసుకొని అవకాశాన్ని కల్పించారు అయితే ఐదుసార్లు కన్నా ఎక్కువగా ఎస్బిఐ ఎటిఎంలలో డబ్బులు డ్రా చేయడం వల్ల ప్రతి ట్రాన్సాక్షన్ పై అదనంగా రూ. 10 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతర ఏటీఎం లలో నెలలో మూడుసార్లు కన్నా ఎక్కువ డబ్బులు డ్రా చేయటం వల్ల ప్రధానంగా రూ. 20 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
2. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులు ప్రతి నెలా తన సొంత ఏటీఎంలో ఐదు లావాదేవీలు ఫ్రీగా జరపవచ్చు. అయితే మెట్రో సిటీలలో ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు, నాన్ మెట్రో సిటీల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా పొందొచ్చు. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.21తోపాటు అనుబంధ చార్జీలు, నాన్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్ మీద రూ.8.50 తో కలిపి మొత్తం రూ. 29.50 చెల్లించాల్సి ఉంటుంది.
3. యాక్సిస్ బ్యాంకు
మెట్రో సిటీల పరిధిలో ఉన్న యాక్సిస్ బ్యాంక్ ఎటిఎం లలో ఐదు లావాదేవీలు , ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఫ్రీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత జరిపే ప్రతి విత్ డ్రా పై రూ.21, నాన్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్‌పైన రూ.10 వసూలు చేస్తుంది.
4. ఐసీఐసీఐ బ్యాంకు
మెట్రో సిటీల పరిధిలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఎటిఎం లలో ఐదు, ఇతర బ్యాంకు ఏటీఎంల్లో మూడు లావాదేవీలు ఉచితంగా జరుపుకునే అవకాశం కల్పించింది. ఆ తర్వాత జరిగే ప్రతి లావాదేవీ పై రూ.20, నాన్ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్ మీద రూ.8.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.