మనలో చాలామంది చిన్నచిన్న విషయాలకు తీవ్రస్థాయిలో భయాందోళనకు గురవుతూ ఉంటారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవడం వల్ల ఎన్నో విషయాలకు తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ భయాందోళనకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. క్రమం తప్పకుండా సాధన చేయడం ద్వారా సులువుగానే ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుందని చెప్పవచ్చు.
ఎవరైతే అత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని అనుకుంటారో వాళ్లు ఎప్పుడూ తమను తము ఇతరులతో పోల్చుకోకూడదు. వ్యక్తిత్వంలో మార్పు ఒక్కసారిగా రావడం సాధ్యం కాదు కాబట్టి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్లడం ద్వారా భయాలను అధిగమించవచ్చు. అభిరుచికి అనుగుణంగా సంతోషాన్ని కలిగించే పనులతో బిజీ కావడం ద్వారా కూడా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇతరులు పొగడ్తలలో నిజానిజాలు నిర్ధారించుకుని ముందుకెళ్లాలి. ఇష్టాయిష్టాలకు, అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ సందర్భానికి అనుగుణంగా నో చెప్పాలి. మన సామర్థ్యంపై మనం నమ్మకం పెంచుకోవడంతో పాటు పొగడ్తలను హుందాగా స్వీకరించడం ద్వారా మంచి ఫలితాలను పొందడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు.
ఈరోజు చేసిన తప్పులు రాబోయే రోజుల్లో రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మరుసటి రోజు చేయాల్సిన పనులను కొత్తగా మొదలుపెట్టడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చేసుకోవచ్చు. ఆత్మవిశ్వాసం ఉంటే భవిష్యత్తులో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను సైతం సులువుగానే ఎదురిస్తామనే నమ్మకం మనపై మనకు కలుగుతుంది.