తెలంగాణలో మా లక్షన్నర ఓట్లు నోటా కే వేస్తాం

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ వివిధ వర్గాలు అన్ని రాజకీయ పార్టీల మీద వత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల నాయకులను కలిసి తమ సమస్యలపై ఏరకమైన భరోసా ఇస్తారు? తమ సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరచండి అంటూ రిక్వెస్టులు చేసుకుంటున్నారు. కొన్ని వర్గాల వారికి రాజకీయ పార్టీల నేతలు అపాయింట్ మెంట్ ఇచ్చి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. మేనిఫెస్టోలో ఆ సమస్యలను పొందుపరుస్తామని హామీ ఇస్తున్నారు. 

ఇవి నర్సుల కష్ట నష్టాలు

కానీ నోట్లో నాలుక లేని వారు మాత్రం ఎంత పెద్ద సంఖ్యలో ఉన్నా సరే లాభమేముందని బాధపడుతున్నారు. రాజకీయ పార్టీల ఆఫీసులకు పోయి కలవాలంటే పలుకుబడి కావాలె గదా? మాకు అంత పలుకుబడి ఎక్కడుంది అని తమను తామే తిట్టుకుంటున్నారు. వారి ఓట్లు లక్షల సంఖ్యలో ఉన్నా సరే రాజకీయ పార్టీలు మాత్రం వాళ్లను పెద్దగా పట్టించుకుంటలేవు. ఎందుకంటే వారు సేవ చేయడం తప్ప రాజకీయం చేయడం తెలియని బడుగు జీవులు. ఇంతకూ వారెవరు అనుకుంటున్నారా? వారే నర్సులు.

వాగులు, వంకలు దాటి వైద్యం చేయక తప్పదు

నర్స్ ల సమస్యలు, రాజకీయ పార్టీల విధానాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్ లక్ష్మణ్ రుడావత్ రాసిన ఆర్టికల్ కింద ఉంది చదవండి.

 

ప్రజారోగ్యాన్ని కాపాడుతున్న నర్స్ లకు భరోసా ఏది ?

నర్సింగ్ సమాజంలో అధిక సంఖ్యలో ఉన్నవారు పేద తరగతి వారే. ఇందులో అన్ని కులాల వారు మరియు అన్ని మతాల వారు ఉన్నారు. అయినా
వీరి సంక్షేమం కోసం ఏ రాజకీయ పార్టీ ఎలాంటి చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. సేవ చేయడమే తప్ప ప్రశ్నించడం తెలియని మూగజీవులు కాబట్టేనా నర్సుల గురించి రాజకీయ పార్టీలు పట్టించుకోవడంలేదు. 

పసి బిడ్డకు టీకాలు వేస్తున్న నర్స్

2018 లేదా 19 లో జరగబోయే ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో నర్సింగ్ సమాజం కోసం తీసుకోబోయే సంక్షేమ కార్యక్రమాలు స్పష్టంగా ప్రకటిస్తారో… వారికే నర్సింగ్ సమాజం మద్దతు. 

తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ కుటుంబాల సంఖ్యా దాదాపుగా ఎనభై వేలకు పైగా ఉన్నాయి. ఒక కుటుంబం నుండి రెండు ఓట్లు చొప్పున చూసుకున్నా ఒక లక్ష అరవై వేల ఓటు బ్యాంకు నర్సింగ్ కుటుంబాల సొంతం. వీరు ప్రభావితం చేయగలిగే ఓట్లు మరో నాలుగు లక్షల వరకు ఉంటాయి. రానున్న ఎన్నికల్లో ఒక వేళ ఏ రాజకీయ పార్టీ కూడా నర్సింగ్ సమాజాన్ని పట్టించుకోకపోతే దాదాపుగా ఆరు లక్షల నర్సింగ్ సమాజం ఓట్లు అన్నీ కూడా నోటా (NOTA) కే వేస్తాము. 

2018 లేదా 19 లో తెలంగాణ రాష్ట్రములోని అన్ని రాజకీయ పార్టీలకు నర్సింగ్ కుటుంబాలు చేస్తున్న విజ్ఞప్తి ఏమనగా.. తమ తమ ఎన్నికల్లో మేనిఫెస్టోలో నర్సింగ్ సమాజము లేవనెత్తిన న్యాయమైన డిమాండ్లను పొందుపరచాలి. 

మారుమూల ప్రాంతాల్లో నర్సులే ప్రాణదాతలు

మా నర్స్ ల కుటుంబాలు అడుగుతున్నా న్యాయమైన డిమాండ్లు ఇవీ :

1. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు ప్రకారం ప్రవేట్ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సెస్ కు కనీస వేతనo 20,000/-ఇవ్వాలి అనే ఉత్తర్వులను అమలు చేయాలి.

2. మన రాష్ట్రములో జెండర్ తో సంబంధ లేకుండా మేల్ నర్సెస్ కూడా ఫిమేల్ నర్సెస్ తో పాటు సమానంగా ఉద్యోగ మరియు ఉన్నత విద్య కు అవకాశాలు కలిపించాలి.

3. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి.అలాగే కాంట్రాక్టు నర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి.ఉన్నవారిని రెగ్యులరైజ్ చేయాలి.

4. ప్రభుత్వ మరియు ప్రేవేటు ఆసుపత్రిలలో పని చేసే ప్రతి నర్సింగ్ ఆఫీసర్ కు ఉద్యోగ మరియు ఆరోగ్య భద్రతా కల్పించాలి.

5. రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టర్ ను ఏర్పాటు చేయాలి .

6. రాష్ట్రములోచదువుతున్న ప్రతి నర్సింగ్ విద్యార్ధి కి 2017 సంవత్సరం నుoడి కాలేజీ ఫీజు పెంచిన విధము గానే నర్సింగ్ విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ మరియ స్టెపంఢ్ వెంటనే పెంచాలి .

7. నర్సింగ్ కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి.

8. ప్రజాక్షేత్రంలో నర్సింగ్ సమాజం గొంతుక వినిపించుటకు MLC సీటును కేటాయించాలి

9. కేంద్ర సర్కారు సవరించిన హోదాను స్టాఫ్ నర్సు నుంచి నర్సింగ్ అధికారిగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ ఉత్తర్వులను నేటి వరకు ఎందుకు అమలు చేయడం లేదు.. ఈ ఉత్తర్వులను అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద నయా పైసా ఖర్చు ఉండదు..అయినా అమలు చేయడం లేదు.

10. రాష్ట్రములో ప్రభుత్వ స్థలంలో పేద నర్సింగ్ కుటుంబాలకు ప్రభుత్వం నర్సింగ్ ఆఫీసర్స్ కాలనీలు ఏర్పాటు చేయాలి.

11 వైద్య శాఖలోనే పనిచేస్తున్న నర్సెస్ కి హెల్త్ కార్డులు అందచెయ్యాలి.

12 ప్రతి జిల్లాలలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయాలి.