Kavitha: కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు.. ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత!

Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదు చేయించిన విషయం మనకు తెలిసిందే. ఇలా కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు కావడంతో ఈ విషయం కాస్త తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారింది. ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్ కావచ్చని తెలుస్తుంది. ఇప్పటికే హైదరాబాదులో పెద్ద ఎత్తున పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేయడంతో కెసిఆర్ అరెస్ట్ కాయమని అందరూ భావిస్తున్నారు.

ఇలా కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో బిఆర్ఎస్ నేతలు ఈ విషయంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ పట్ల కేసు నమోదు కావడంతో ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా రేవంత్ సర్కారుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈమె చూసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక ఈయన కేటీఆర్ పై కేసు పెట్టారని ధ్వజమెత్తారు.కేసీఆర్, భారాసను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ చర్యలు, వ్యవహరిస్తోన్న తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.

మేమంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన కెసిఆర్ సైనికులమని తెలిపారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని తెలిపారు మీరు అక్రమంగా కేసులను నమోదు చేస్తూ చేస్తున్న ప్రయత్నాలు మమ్మల్ని భయపెట్టలేవు. మేం మరింత బలపడతాం. మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది తెలంగాణ స్ఫూర్తి గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా కేటీఆర్ పై కేసు నమోదు కావటాన్ని ఈమె తీవ్రంగా ఖండిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.