బిజెపి పై నిప్పులు చెరిగిన కేసీఆర్

 

ప్రస్తుతం జరిగిన మున్సిపాట్లి ఎన్నికల్లో టిఆర్ ఎస్ ముందంజలో ఉంది. ఇప్పటికే కార్ దూకుడుకి మిగతా పార్టీలు వెనకపడిపోయాయి. ఈ ఎన్నికల విషయంలో కేసీఆర్ మంచి జోష్ మీదున్నాడు. ప్రస్తుతం టి ఆర్ ఎస్ ప్రభుత్వానికి గొప్ప విజయాన్ని అందిస్తున్న ప్రజలకు అభివాదం తెలిపిన కేసీఆర్, అదే సమయంలో బిజెపి పార్టీ పై నిప్పులు చెరిగారు. బిజెపి ఎంత దాని బతుకెంత అంటూ ఘాటుగా స్పందించారు. బిజెపికి మాత రాజకీయాలు తప్ప వేరే తెలియదని అన్నారు. బిజెపి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో పడిపోతుందని, ఢిల్లీ లో కూడా కేజ్రీవాల్ గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయంటూ కేసీఆర్ అన్నారు. ఎంపీ అసదుద్దీన్ గడ్డం తీసి నాకు అతికిస్తారంట సి ఎం ముక్కు కోస్తానని అనడం అంతవరకు సమంజసం ? ఇవేనా బిజెపి కి ఉన్న నైతిక విలువలు అన్నారు. ఇటీవలే భైంసా లో జరిగినది దుర్మార్గమే, భైంసా అల్లర్లలో వెళ్లే ఉన్నారు. అక్కడ పరిస్థితిని అదుపు చేసి ఎన్నికలు సజావుగా నిర్వహించాం అన్నారు కేసీఆర్.

మూసనిపాలిటి ఎన్నికల్లో ప్రజలు పనిచేసేవారికి మంచి విజయం అందించారని, ప్రత్యర్థులకు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. లక్ష్యం కోసం పనిచేసే వారికీ ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ ఎస్ పార్టీకి పట్టం కట్టారని, ప్రజలకు ఈ సందర్బంగా ప్రజల మేలు మరిచిపోలేమని అయన అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామని, ఈ సందర్బంగా కేటిఆర్ కు తన ఆశీస్సులు తెలుపుతున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో మెం పెద్దగా ప్రచారం చేయలేదు. కేటీఆర్ దావోస్ వెళ్లారు, ఈ ఎన్నికల్లో నేను ఎక్కడికి వెళ్లి ప్రచారం చేయలేదు. ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు, ఇప్పటివరకు విపక్ష నేతలు సీఎం, నాయకులను టార్గెట్ చేసి తిట్టారు .. కానీ ఇకపై వ్యక్తిగత దూషణలు సంహించం. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచినా అభ్యర్థులకు అభినందనలు తెలిపారు కేసీఆర్.