తెలంగాణలో తప్పు తోవ పడుతున్న గొర్రెల పంపిణీ పథకం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం పక్కదారి పడుతుంది. సీఎం కేసీఆర్ అందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం ఇది. అర్హులందరికి ఒకే సారి గొర్రెలు పంపిణి చేయాలనే లక్ష్యంతో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి గొర్రెలను తీసుకొచ్చి పంపిణీ చేశారు. అయితే వాతావరణానికి తట్టుకోలేక కొన్ని గొర్రెలు పంపిణీ చేసిన వారం రోజుల్లోనే చనిపోయాయి. మరికొన్నిటి పరిస్థితి అలాగే ఉంది. దీంతో గొర్రెల పథకం తప్పుతోవ పట్టింది. ఇది కరెక్టు కాదంటూ పోలీసులు వాటి తరలింపును అడ్డుకున్నారు. గొర్రెలు తప్పుదోవపడుతున్నాయా, గొర్రెల పథకం తప్పుదోవపడుతుందా అనే చర్చ నడుస్తుంది. సూర్యాపేట జిల్లా పెన్ పహడ్ లో గొర్రెలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆ ఫోటోలు తీసిన కొంతమంది గొర్రెలను అరెస్టు చేస్తున్నారని, గొర్రెల రక్షణకు పోలీసుల కాపలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.