తెలంగాణ పంచాయతీ కార్మికులకు సర్కార్ ఝలక్

తెలంగాణ పంచాయతీ కార్మికులపై సర్కార్ సీరియస్ అయ్యింది. వెంటనే విధుల్లోకి హాజరు కావాలని లేని పక్షంలో వారిని తీసేని వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తామని కార్మికులను హెచ్చరించింది.  తెలంగాణ వ్యాప్తంగా 33,534 మంది పంచాయతీ సిబ్బందికి గాను  19,752 విధులకు హాజరు కావడం లేదని గురువారం లోగా విధులకు హాజరుకాకుంటే వారి స్థానంలో ప్రత్యామ్నాయం చూడాలని ఆదేశించింది. ప్రత్యేక అధికారుల ద్వారా వివరాలు తీసుకొని విధులకు హాజరుకాని వారిపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పంచాయతీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. తమ వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో వారు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. గ్రామాలలో పనులు నిలిచిపోయి, చెత్త పేరుకుపోయి  అస్తవ్యస్తంగా గ్రామాల పరిస్థితి ఏర్పడింది. దీంతో తెలంగాణ సర్కార్ కార్మికులపై చర్యలకు సిద్దమైంది.