తెలంగాణ మంత్రి కేటీఆర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య ట్విట్టర్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. రాజకీయ పార్టీల నేతలుగా కాకుండా.. వీరిద్దరూ ఒకరినొకరు అన్నా, తమ్ముడూ అంటూ పలకరించుకోవడం చూస్తుంటే.. వీరి మధ్య అనుబంధం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. కరోనా విపత్తును ఎదుర్కోవడానికి తెలుగు రాష్ట్రాలు చేస్తోన్న కృషికి తన వంతు సాయంగా పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్‌కు చెరో రూ.50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని స్వయంగా పవన్ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. పవన్ పెట్టిన ఆ పోస్ట్‌కు కేటీఆర్ ధన్యవాదాలు అంటూ సమాధానం ఇచ్చారు. ఇక్కడితో ఆగిపోలేదు వీరి సంభాషణ.. పవన్ కళ్యాణ్ కూడా.. ఇలాంటి విపత్కర సమయంలో.. కేసీఆర్ నాయకత్వంలో సమర్థవంతంగా మీరు చేస్తోన్న కృషికి మనస్పూర్తిగా ధన్యవాదాలు.. అన్నారు. అయితే ఇందులో కేటీఆర్ ను సర్ అని సంబోధించారు పవన్.
ధ్యాంక్స్ అన్నా.. మీరు ఎప్పటినుండి నన్ను సర్ అని పిలవడం మొదలు పెట్టారు.. ఎప్పటికీ మీ తమ్ముడినే అనడం.. అందుకు సరే బ్రదర్ అంటూ పవన్ రిప్లై కూడా ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాగుంది కదా వీరి సంభాషణ. రాజకీయాలు మరచి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోవడం.