ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం యమహా మోటార్ ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైక్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొత్త కొత్త ఫీచర్ లు కలిగిన బైక్, స్కూటర్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంది. అందులో భాగంగానే యమహా మోటార్ ఇండియా కొత్త ఏరోక్స్ ఎస్ మ్యాక్సీ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 1.51 లక్షలతో ప్రారంభం అవుతుంది. కాగా ఈ మోడల్ మనకు సిల్వర్, రేసింగ్ బ్లూ అనే 2 ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ కొత్త వేరియంట్ హార్డ్‌వేర్, కొలతలు, మెకానిక్స్ పరంగా మారదు. బైకులోని కొత్త ఫీచర్ కీలెస్ ఇగ్నిషన్ కలిగి ఉంది.
ఈ కొత్త ఫీచర్‌తో స్కూటర్ ఇప్పుడు స్టాండర్డ్ కౌంటర్‌పార్ట్ కన్నా దాదాపు రూ. 3వేలు ఎక్కువగా ఉంటుంది. దేశవ్యాప్తంగా కంపెనీ బ్లూ స్క్వేర్ డీలర్ షిప్‌ల ద్వారా ఈ స్కూటర్‌ను విక్రయించనుంది. యమహా ఏరోక్స్ ఎస్ కొత్త బైక్ మోడల్ స్మార్ట్ కీ ఫీచర్ కలిగి ఉంది. ఏరోక్స్ 155 ఎస్‌లోని స్మార్ట్ కీ ఫీచర్ సాయంతో ఫ్లాషింగ్ లైట్లు, బజర్‌తో కూడిన స్కూటర్‌ను ఆన్సర్ బ్యాక్ సామర్థ్యంను కలిగి ఉంది. అలాగే నాబ్‌ను తిప్పడం, స్టార్ట్ బటన్‌ను నొక్కడం వంటి పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా కీ ని ఉపయోగించకుండా స్టార్ట్ చేయవచ్చు. స్మార్ట్ కీలు ఉన్న ఇతర వాహనాల మాదిరిగానే కీ చుట్టూ సెన్సార్‌ను కలిగి ఉంది.
యమహా ఏరోక్స్ ఎస్ ఏరోక్స్ ఎస్ ఇంజిన్ 155సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ మోటార్ కలిగి ఉంది. 15హెచ్‌పీ, 13.9ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ20 ఇంధన కంప్లైంట్ కూడా ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఓబీడీ-II సిస్టమ్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కంపెనీ శ్రేణిలో కొత్త వెర్షన్ ఎస్ వచ్చి చేరడంతో టూ వీలర్ తయారీదారులకు ఈ కొత్త ఏరోక్స్ ఎస్ బైక్ ఫ్లాగ్‌షిప్ స్కూటర్‌గా మారింది.