ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. అలాగే వాట్సాప్ వినియోగదారుల వినియోగదారుల భద్రత కోసం ఇప్పటికే పలు రకాల ఫీచర్లను తీసుకురాగా తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది. కాగా ఇటీవల వాట్సాప్ 2జీబీ వరకు ఫైల్ లను పంపడానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు వాట్సాప్ ఇంటర్నెట్ లేకుండా ఫైళ్లను పంపే అవకాశాన్ని అందిస్తోంది. ఫోటో, వీడియో, ఇతర ఫైల్ లను ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా ఆఫ్‌లైన్ లో షేర్ చేయవచ్చు. అయితే, ఫైల్ షేరింగ్ సమీపంలోని మొబైల్ లకు మాత్రమే సాధ్యం అవుతుంది. బ్లూటూత్ సహాయంతో ఫైల్ లను షేర్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ అందిస్తుంది. అయితే ఈ న్యూ ఫీచర్ ని వాట్సాప్ తన బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించడానికి, మీరు మీ ఫోన్ ఫోటో గ్యాలరీని తెరవడానికి, స్థానాన్ని పొందడానికి అనుమతించాలి.
సమీపంలోని పరికరాలను కూడా అనుమతించాలి. సాధారణంగా చాలా యాప్‌లు ఇలాంటి అనుమతులను అడుగుతాయి. ఈ యాప్‌ల అన్ని ఫీచర్‌లు పని చేయడానికి ఈ అనుమతులను మంజూరు చేయడం కూడా అవసరం. వాట్సాప్ ఈ ఆఫ్‌లైన్ ఫైల్ షేరింగ్ ఫీచర్‌ని పరీక్షిస్తోంది. ఎప్పుడు విడుదల చేస్తుందో తెలియదు. కానీ త్వరలో ప్రారంభం కావచ్చని సమాచారం. మీరు ఫైల్ షేరింగ్ ఫీచర్ వద్దనుకుంటే, మీరు దీన్ని ఎప్పుడైనా మాన్యువల్‌గా నిలిపివేయవచ్చు.