ఇంటర్నెట్ ఉపయోగించేవారు యాడ్స్ చూడకుండా తప్పించుకోవటం జరగని పని. గూగుల్ తన సెర్చ్ ఇంజన్, వీడియో స్ట్రీమింగ్ యాప్ యూట్యూబ్‌లో విపరీతంగా యాడ్స్ చూపిస్తూనే ఉంటుంది. అంతే కాకుండా గూగుల్ యాడ్సెన్స్ ఎనేబుల్డ్ సైట్స్‌లో కూడా గూగుల్ యాడ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని పూర్తిగా కనిపించకుండా ఆపలేకపోయినా కూడా కష్టమైస్ చేసుకోవటం ఇప్పుడు సాధ్యం. మై యాడ్ సెంటర్ అనే కొత్త ఫీచర్ ని గూగుల్ ప్రవేశ పెట్టింది. ఈ ఫీచర్ ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తుంది.
ఈ ఫీచర్ ని ఉపయోగించి యూజర్లు తమకు నచ్చిన యాడ్స్ మాత్రమే కనిపించేలా వారికి అవసరం లేని యాడ్స్ ని పూర్తిగా కనిపించకుండా ఆపివేసే అవకాశం గూగుల్ కల్పించింది. మనకు నచ్చిన యాడ్స్ మాత్రమే చూసేలా వాటిని కష్టమైస్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది . గూగుల్ ‘మై యాడ్ సెంటర్’ను Google I/O 2022లో మొదటిసరిగా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ సైట్స్, యాప్‌లలో కనిపించే యాడ్స్ కంట్రోల్ చేయటానికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. గూగుల్‌కి సైన్ ఇన్ చేసినప్పుడు సెర్చ్, యూట్యూబ్, డిస్కవర్‌లోని యాడ్స్‌లో కనిపించే త్రీ డాట్స్‌పై ప్రెస్ చేసి నేరుగా ‘మై యాడ్ సెంటర్’ను యాక్సెస్ చేయవచ్చు.
ఇక్కడ ఇష్టపడే బ్రాండ్స్, టాపిక్స్‌ఎక్కువగా కనిపించేలా ….మనకు ఇష్టం లేని వాటిని తక్కువగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అంతేకాకుండ పర్సనలైజ్డ్ యాడ్స్ చూడకూడదని భావించే వారు వాటిని చాలా తక్కువగా మాత్రమే చూడవచ్చు. యాడ్ పర్సనలైజేషన్ అనేది యూట్యూబ్ హిస్టరీ వాడకూడదనుకుంటే.. మై యాడ్ సెంటర్‌లో దాన్ని ఆఫ్ చేయవచ్చు. ఈ సందర్భంలో ఫీడ్‌లోని రిలవెంట్ రికమండేషన్స్ ఎఫెక్ట్ కావు. ఇక గూగుల్‌కి సంబంధించినవి కాకుండా ఇతర సైట్లు, యాప్‌లలో యాడ్స్ ఇవ్వడానికి గూగుల్ టూల్స్‌ను బిజినెస్‌లు ఉపయోగించవచ్చు. అలా చేయటం వల్ల ఆ వ్యాపారాలకు సంబంధించిన యాడ్స్ మీకు కనిపిస్తాయి.