సాధారణంగా మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు జనరల్ టికెట్ కనుక తీసుకుంటే మనం రైలు చివరి భోగిలలో ఎక్కాల్సి ఉంటుంది. ఇలా భారతీయ రైల్వేలో జనరల్ బోగీలు ఎందుకు రైలుకు చివరిలోనే ఉంటాయి. ఈ భోగిలను ఎందుకు రైలు మధ్యలో ఏర్పాటు చేయరు?ఇలా జనరల్ బోగీలు రైలు చివరిన లేదా మొదట్లో ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా… మరి జనరల్ బోగీలో రైలుకు చివరిలోని ఎందుకు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం…
రైల్వే అధికారుల ప్రకారం సాధారణంగా ఇతర కోచులలో ప్రయాణించే వారి కంటే జనరల్ బోగీలలో ప్రయాణించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. ప్రతి స్టేషన్ నుంచి జనరల్ బోగీలో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి జనరల్ బోగీలను మధ్యలో పెడితే ఇతర కోచ్ లలో ప్రయాణించే వారికి ఎంతో ఇబ్బందిగా మారడమే కాకుండా పూర్తిగా వ్యవస్థ మొత్తం తారుమారు అవుతుంది. జనరల్ బోగీలను రైలు మధ్యలో పెట్టడం వల్ల ఇతర కోచ్ లకు వెళ్లేవారు ప్రశాంతంగా వెళ్లలేరు. అంతేకాకుండా జనరల్ బోగీలో స్థలం లేకపోతే ఇతర కోచ్ లలో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తారు.
ఇక రైలులో జనరల్ భోగిలను చివరిన ఉంచడానికి మరొక కారణం కూడా ఉంది ఏదైనా జరగరాని ప్రమాదం కనుక జరిగితే జనరల్ బోగీలు మధ్యలో గనక ఉంటే రెస్క్యూ ఆపరేషన్ చేయడం కష్టమవుతుంది. దీనివల్ల రైలు ప్రారంభంలో లేదా చివరిలో జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా జనరల్ బోగీలో చివరిలో ఉండటం వల్ల రెస్క్యూ-రిలీఫ్ ఆపరేషన్‌లలో సహాయపడుతుంది.