సాధారణంగా దూరప్రాంతాలకు వెళ్లేవారు తప్పనిసరిగా రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు ఇలా రైలు ప్రయాణం చేయడం ఎంతో సౌకర్యవంతమే కాకుండా సురక్షితమైన ప్రయాణమని భావిస్తారు అందుకే సుధీర ప్రాంతాలకు వెళ్లేవారు తప్పనిసరిగా రైలు ప్రయాణం చేస్తూ ఉంటారు.ఇకపోతే చాలామంది పగలు రైలు ప్రయాణం చేయడం కన్నా రాత్రిపూట ప్రయాణం చేయడం వల్ల సమయం కలిసి వస్తుందని భావించి ఎక్కువగా రాత్రి పూట రైలు ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.ఇలా రాత్రిపూట రైలులో ప్రయాణం చేసే వారికి ఇండియన్ రైల్వే పలు నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది.
ఇలా రాత్రిపూట రైలులో ప్రయాణం చేసే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తు పెట్టుకొని పాటించాలని ఇండియన్ రైల్వే పేర్కొంది. రాత్రిపూట రైలులో ప్రయాణించే ప్రయాణికులు 10 గంటల తర్వాత మొబైల్ ఫోన్స్పీకర్ ఆన్ చేసి మాట్లాడటం పాటలు వినడం గట్టిగ శబ్దాలు చేస్తూ మాట్లాడటం వంటివి పూర్తిగా మానుకోవాలి. పది దాటిన తర్వాత కేవలం రైలు లైట్లు తప్ప ఇతర లైట్లు వెలగకూడదు.ఇక రైలులో ప్రయాణించేవారు గుంపులుగా చేరి మాటలు పెట్టుకుని తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకూడదు.
ప్రయాణికుల సౌకర్యార్థం మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తెరిచేలా రైల్వేశాఖ ఏర్పాట్లు చేసింది. అంటే మిడిల్ బెర్త్ బుక్ చేసుకున్న ప్రయాణికులు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆ బెర్త్ తెరిచి అందులో నిద్రపోవచ్చు. రైలులో మండే వస్తువులను తీసుకెళ్లడానికి అనుమతించరు. ఈ నిబంధనలను పాటించేలా సహకరించాలని భారతీయ రైల్వే ప్రయాణికుల్ని కోరుతోంది.