WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. రీసెంట్గా ఎవరు ఆన్లైన్లోకి వచ్చారో తెలుసుకోండిలా!

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. కాగా ఇప్పుడు తాజాగా మరొక ఫీచర్ తీసుకురావడానికి సిద్ధమైంది. సాధారణంగా వాట్సాప్ యూజర్లు ఎవరైనా ఆన్‌లైన్‌లో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి, వారి ప్రొఫైల్‌ను చూస్తారు. ఇలా ప్రతి ఒక్కరి ప్రొఫైల్ చెక్ చేయడానికి కొందరు విసుకుంటూ ఉంటారు.

కానీ త్వరలోనే స్నేహితులు లేదా కాంటాక్ట్స్‌లో ఎవరు రీసెంట్‌గా ఆన్‌లైన్‌కు వచ్చారో చూడటం మరింత సులభం అవుతుంది. ఇందుకు వాట్సాప్ ఒక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌తో స్క్రీన్ కింద ఉన్న + ఐకాన్‌ను క్లిక్ చేసినప్పుడు, రీసెంట్‌గా ఆన్‌లైన్‌లో ఉన్న వ్యక్తుల లిస్ట్‌ కనిపిస్తుంది. ఈ కొత్త ఫీచర్ వాట్సాప్‌ను మరింత సౌకర్యవంతంగా, ఉపయోగకరంగా మార్చుతుంది. దీనితో కాసేపటి క్రితమే ఆన్‌లైన్‌కు ఎవరెవరు వచ్చారో తెలుసుకోవచ్చు. ప్రతిసారీ వారి ప్రొఫైల్‌ను లేదా చాట్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యాప్ బీటా వెర్షన్ 2.24.9.14 ద్వారా టెస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చాక వాట్సాప్‌ను తెరిచినప్పుడు రీసెంట్లీ ఆన్‌లైన్ అనే కొత్త ట్యాబ్‌ కనిపిస్తుంది. ఈ ట్యాబ్‌లో రీసెంట్‌గా ఆన్‌లైన్‌లోకి వచ్చిన కాంటాక్ట్స్‌ లిస్ట్‌ కనిపిస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఈ కొత్త ఫీచర్‌ను పొందవచ్చు.