స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉపయోగించే వాటిలో వాట్సాప్ ఒకటి.ఇది ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ గా పని చేయడంతో ఎంతోమంది వాట్సప్ ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే యూసర్ల కోసం వాట్సాప్ ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చి ఎప్పటికప్పుడు సేవలను వినియోగదారుల ముందుకు తీసుకువస్తుంది అయితే తాజాగా మరొక అదిరిపోయే ఫీచర్ ని కూడా వాట్సాప్ అందుబాటులోకి తెచ్చింది. మరి ఆ ఫీచర్ ఏంటి ఎలా పని చేస్తుంది అనే విషయానికి వస్తే…
అదే గ్రూప్ కాల్ షెడ్యూల్. వాట్సాప్ అప్లికేషన్‌లో గ్రూప్ కాల్ షెడ్యూల్ ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ సంస్థ అనే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ పొజిషన్లో ఉంది. ముందుగా టెస్ట్ ఫ్లై ప్రొగ్రాంలో నమోదు చేసుకున్నవారికి, లేటెస్ట్ అప్‌డేట్ వెర్షన్ iOS 23.4.0 వాట్సాప్ బీటా వినియోగిస్తున్న వారికి ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. గతంలో ముఖ్యమైన రోజున మన కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతో లేదా ఆఫీస్ మీటింగ్ ల గురించి చర్చించాలనుకుంటే తప్పనిసరిగా ఆ విషయాలను ఆ తేదీన రిమైండర్ పెట్టుకునేవారు.
ఇక ఈ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే మనం ఎవరితో అయితే మాట్లాడాలి అనుకుంటున్నామో అలాంటి వారితో ఎప్పుడు ఏ సమయంలో మాట్లాడాలో ముందుగా షెడ్యూల్ చేసి పెట్టుకోవచ్చు. ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉండేవారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుందని WABetainfo తన నివేదికలో వెల్లడించింది.ఇలా ఈ యాప్ అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువగా ఎవరికైనా పెళ్లి రోజు శుభాకాంక్షలు లేదా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి అనుకుంటే కరెక్ట్ తేదీ సమయానికి షెడ్యూల్ చేయడం వల్ల వెంటనే వారికి మనం శుభాకాంక్షలు చెప్పవచ్చు. గ్రూప్ కాల్ షెడ్యూల్‌ను ఆడియో లేదా వీడియో కాల్స్ రూపంలో ఎలాగైనా చేసుకునే అవకాశం ఉంది.