21 ఎమోజీలతో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్!

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు.ఇలా స్మార్ట్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉపయోగించే వాటిలో ఇన్స్టంట్ మెసేజింగ్ వాట్సాప్ ఒకటి.ఇలా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రోజురోజుకీ వాట్సాప్ ఉపయోగించే వారి సంఖ్య అధికమవుతుంది. ఇలా పెరుగుతున్నటువంటి వినియోగదారులను దృష్టిలో పెట్టుకున్నటువంటి వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో వరుస అప్డేట్ లతో వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుంది వాట్సాప్ సంస్థ. ఇందులో భాగంగానే తాజాగా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇప్పటికే మనకు ఎన్నో రకాల ఎమోజీలను వాట్సప్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వాట్సాప్‌ కంపెనీ 21 కొత్త ఎమోజీలను లాంచ్‌ చేస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా చిన్న చిన్న మార్పులతో 8 ఎమోజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్‌ డివైజ్‌ లలో ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్‌ వాట్సాప్‌ బీటా ఇన్‌స్టాల్‌ చేసుకున్న బీటా టెస్టర్‌ లకు కొత్త ఎమోజీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఈ ఎమోజీలను వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు WABetainfo వెల్లడించింది. వివరాలను కూడా తెలిపింది.

ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. మేము ఇంతకుముందే యూనికోడ్ 15.0 నుంచి 8 ట్వీక్డ్ ఎమోజీలు, 21 కొత్త ఎమోజీల గురించి సమాచారాన్ని షేర్‌ చేశాం. 21 కొత్త ఎమోజీలు డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉండటంతో కీబోర్డ్‌లో కనిపించలేదు. ఆల్టర్నేటివ్ కీబోర్డ్‌ని ఉపయోగించి వాటిని సెండ్‌ చేయవచ్చని తెలిపాము. అయితే ఇప్పుడు బీటా టెస్టర్‌ల కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌ లో ఆండ్రాయిడ్‌ 2.23.5.13 వెర్షన్‌ని ఆండ్రాయిడ్‌ బీటా అందుబాటులో ఉందనీ తెలిపారు.ఇలా కొత్త ఇరవై ఒక్క ఎమోజీలు కనుక అందుబాటులోకి వస్తే ఇప్పుడు ఇతరులతో చాటింగ్ మరింత సులభతరం కానుందని తెలుస్తోంది.