సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్… గ్రూప్ లో జాయిన్ కావాలంటే పర్మిషన్ కావాల్సిందే!

ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నటువంటి వాటిలో వాట్సాప్ ఒకటి.ఇలా వాట్సాప్ తమ వినియోగదారులను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇలా ఇప్పటికే ఎన్నో రకాల కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సప్ తాజాగా మరొక కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చినటువంటి సరికొత్త ఫీచర్ ఏంటి ఆ వివరాలను కనుక చూస్తే…

గ్రూప్ అడ్మిన్‌లుగా ఉన్న వినియోగదారులు కొత్త వ్యక్తులను ఆమోదించడానికి అనుమతిని ఇచ్చే విధంగా ఒక సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు మరింత నియంత్రణను ఇస్తుంది.ఇన్వైట్ లింక్ ద్వారా గ్రూపులో చేరే వారి సంఖ్య పరిమితం కావాలన్నా లేదా వారిని నియంత్రించాలన్నా కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. సెట్టింగ్స్ నుంచి ప్రారంభించిన తర్వాత వాట్సాప్ వినియోగదారులు గ్రూప్ చాట్‌లో కొత్త పార్టిసిపెంట్‌లు గ్రూప్‌లో చేరడానికి అడ్మిన్ నుంచి అనుమతిని కోరుతున్నట్లు ప్రాంప్ట్ చేసే సందేశాన్ని చూస్తారు.

ఈ అప్డేట్ చెందినటువంటి ఈ ఫీచర్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో అందరికీ విడుదల కానుంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత, వినియోగదారులు గ్రూప్ సెట్టింగ్‌లలో కొత్త గ్రూప్ సెట్టింగ్‌లను కనుగొంటారు. ఇలా ఈ టీచర్ ద్వారా మనం గ్రూపులో ఎవరైనా చేరాలి అంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.అయితే ఇది గ్రూపులో చేరే వారి సంఖ్యను పూర్తిగా నియంత్రించడంలో ఎంతో దోహదపడుతుందని చెప్పాలి.