లోన్ తీసుకోవాలనుకుంటున్నారా… అయితే ఇప్పుడు ఫోన్ పే ద్వారా కూడా లోన్ పొందవచ్చు…?

hyderabad police arrested two men who were involved in loan apps Scandal

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. అందువల్ల ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆన్లైన్ విధానంలోకి మారిపోయాయి. గతంలో లావాదేవీలు జరపాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సి ఉండేది. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందడం వల్ల ప్రస్తుతం స్మార్ట్ఫోన్ చేతిలో పట్టుకొని ట్రాన్సాక్షన్స్ జరపవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే , నెట్ బ్యాంకింగ్ వంటి యాప్స్ ద్వారా ఇంట్లో కూర్చొని కష్టపడకుండా ఒక బ్యాంక్ అకౌంట్ నుండి మరొక బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు పంపవచ్చు. ఇలా ఎన్నో రకాల ఆన్లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి రావడం వల్ల కంపెనీల మధ్య పోటీ పెరుగుతుంది. దీంతో పేమెంట్‌ యాప్స్‌ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్నాయి.

పేమెంట్ యాప్స్ మాత్రమే కాకుండా లోన్‌లకు కూడా రకరకాల యాప్‌లు పుట్టుకొచ్చాయి. అంతే కాకుండా కొన్ని ప్రముఖ బ్యాంకులు కూడా యాప్‌ ద్వారా లోన్‌లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పేమెంట్ యాప్ అయిన ఫోన్ పే కూడా తన కస్టమర్లకు సదుపాయాన్ని కల్పించింది. దీంతో లోన్ తీసుకోవాలని భావించేవారు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఫోన్పే ద్వారా దాదాపు రూ. 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. అయితే ఈ యాప్‌ నేరుగా కాకుండా పలు ఫిన్‌టెక్‌ సంస్థల ద్వారా లోన్‌లను అందిస్తోంది.

మనీ వ్యూ, బడ్డీ లోన్స్‌ వంటి కంపెనీలను ఫోన్ పే ప్రమోట్ చేస్తోంది. దీంతో ఈ కంపెనీల ద్వారా ఫోన్ పే తన యూజర్లకు లోన్‌లు అందిస్తోంది . ఫోన్ పే ద్వారా లోన్ పొందాలంటే మీ సిబిల్‌ స్కోర్ మీద ఆధార పడి ఉంటుంది. ఫోన్ పే లో మీ సిబిల్‌ స్కోర్ ఆధారంగా గరిష్టంగా రూ. 5 లక్షల వరకు ఇన్‌స్టంట్‌ లోన్‌ను పొందవచ్చు. ఫోన్‌పే ఈ సంస్థను ప్రమోటం చేస్తుండడంతో యూజర్లలో సైతం నమ్మకం ఏర్పడింది. ఫోన్ పే ద్వారా లోన్ పొందటానికి ముందుగా ఫోన్‌ పే యాప్‌ను ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత కింద ఉన్న స్పాన్సర్‌ లింక్‌లో కనిపించే మనీ వ్యూ లేదా బడ్డీ లోన్‌ల లో ఏదో ఒకటి సెలక్ట్‌ చేసుకోవాలి. దీంతో వెంటనే వాటి వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుంది. ఆ తర్వాత అక్కడ అడిగిన సమాచారాన్ని అందించి లోన్ పొందవచ్చు.