ఆధార్ కార్డు లోని ఫోటో మార్చాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..?

మన భారతదేశంలో ప్రతి మనిషికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. మన దేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు ఒక గుర్తింపు కార్డు. ఈ ఒక్క ఆధార్ కార్డు ద్వారా ఎన్నో పనులు సులభంగా చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన ఏ పని జరగాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా స్కూల్ పిల్లల అడ్మిషన్ దగ్గర నుండి ఉద్యోగస్తులు జీతం అందుకునే వరకు ఆధార్ కార్డ్ తప్పనిసరి అయ్యింది. భారతదేశంలోని ప్రతి వ్యక్తి జీవితంలో ఆధార్ కార్డు ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అయితే ఆధార్ కార్డు లోని ప్రొఫైల్ ఫోటోలు సరిగా లేకపోవడం లేదా వయసు పెరగటంతో ఫోటో గుర్తించలేకపోవటంతో చాలామంది ఆధార్ కార్డు ఫోటోని మార్చాలని అనుకుంటారు. అయితే గతంలో ఆధార్ కార్డు లో ఉన్న ఫోటోలు మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం సులభమైన పద్ధతి ద్వారా ఆధార్ కార్డు ఫోటోని అప్డేట్ చేయవచ్చు. అయితే ఆధార్ కార్డు లో ఉన్న ఫోటోని అప్డేట్ చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆధార్ కార్డు లో ఉన్న ఫోటోని అప్డేట్ చేయటానికి ముందుగా మీ మొబైల్ నంబర్ ని ఆధార్ కార్డు కి అనుసంధానం చేయాలి. ఆ తర్వాత దగ్గర్లోని ఆధార్ సెంటర్ కి వెళ్లి UIDAI వెబ్‌సైట్‌ లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ విభాగానికి వెళ్లి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అప్‌డేట్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన ఈ ఆధార్ ఎన్రోల్మెంట్ ఫారమ్‌లో అడిగిన డీటెయిల్స్ రాసి సమీపంలోని ఆధార్ సెంటర్‌లో సమర్పించండి. ఈ ప్రక్రియ కోసం మీరు రూ.100 వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ తర్వాత మీకు రసీదు కూడా ఇవ్వబడుతుంది. ఆ తర్వాత రసీదుపై ఉన్న URN నంబర్‌ని ఉపయోగించడం ద్వారా ఆధార్ అప్‌డేట్ చేయబడిందో లేదో మనం తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డ్ లో మీ ఫోటో అప్డేట్ అయిన తర్వాత కొత్త ఆధార్ కార్డు మీ ఇంటికి వస్తుంది.