ఎల్ఐసి పాలసీలో నామిని పేరు మార్చాలనుకుంటున్నారా… ఇలా చేయండి!

భారతదేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎన్నో రకాల సేవలను అందిస్తోంది.అయితే మనం ఒక పేరు మీద ఎల్ఐసి లో పాలసీ తీసుకుంటే తప్పనిసరిగా ఒక నామినీని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎల్ఐసి పాలసీదారుడు కనుక మరణిస్తే ఆ డబ్బులు మొత్తం నామినీకి చెందుతాయి. అందుకే పాలసీని చేసినప్పుడే నామిని పేరు కూడా జత చేయాల్సి ఉంటుంది. అయితే ఒకసారి నామిని పేరు నమోదు చేసుకున్న తర్వాత చాలామంది నామిని పేరు మార్చుకునే అవకాశం లేదని భావిస్తూ ఉంటారు.

ఈ విధంగా ఒకసారి ఎల్ఐసి పాలసీ నామిని దారుడు పేరు రిజిస్టర్ చేసిన తర్వాత తిరిగి నామిని పేరును మనం మార్చుకోవచ్చు. ఇలా నామిని పేరును ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు.ఎల్ఐసి నామిని పేరు మార్చుకోవడానికి ఎలాంటి పరిమితులు లేవు అయితే నామిని పేరు ఎలా మార్చుకోవాలి ఏం చేయాలి అనే విషయానికి వస్తే….

ఎల్ఐసి బీమా చేయించుకున్న తర్వాత నామిని పేరు మార్చుకోవాలంటే ముందుగా ఎల్ఐసి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో నామినేషన్ మార్పు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా ఈ ఫారంలో మనం ఎవరినైతే కొత్తగా నామినీగా నియమించుకుంటున్నామో వారి వివరాలన్నింటినీ నమోదు చేయాలి. ఈ విధంగా వివరాలన్నింటిని పూర్తి చేసిన ఎల్‌ఐసీ శాఖను సందర్శించడం ద్వారా నామినీ పేరును మార్చచ్చు. ఈ విధంగా నామిని పేరు మార్పు కోసం పత్రాలు, పాలసీ బాండ్, పాలసీదారు, నామినీ మధ్య రిలేషన్ షిప్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది.