సుప్రీం చావుదెబ్బ: వేలకోట్ల కోసం ‘ఫండింగ్’ మొదలుపెట్టిన ఐడియా – వోడాఫోన్..!

Voda-Idea weighs fundraising

జియో రావడం రావడమే మిగితా టెలికాం కంపెనీలను దెబ్బతీసింది. జియో బంపర్ ఆఫర్లతో మిగితా టెలికాం కంపెనీలు కుదేల్ మన్నాయి. జియో దెబ్బకు నష్టాలను చవిచూస్తున్నాయి. దాన్ని తట్టుకునేందుకే వొడాఫోన్, ఐడియా రెండు కంపెనీలు ఒక్కటయ్యాయి. అయినా కూడా ఫలితం లేదు. రెండు కంపెనీలు కలిసినా.. నష్టం మాత్రం రోజురోజుకూ పెరుగుతూ పోతోంది.

Voda-Idea weighs fundraising
Voda-Idea weighs fundraising

దీంతో తప్పని పరిస్థితుల్లో వొడాఫోన్ ఐడియా కంపెనీ ఫండ్ రైజింగ్ కోసం చేయి చాపడానికి సిద్ధమయింది. ఇప్పటికే సుప్రీం కోర్టు కూడా టెలికం కంపెనీల ఏజీఆర్ కు సంబంధించిన జడ్జిమెంట్ ను రిలీజ్ చేయడంతో ఏం చేయాలో తెలియక.. ఫండ్ రైజింగ్ మొదలు పెట్టింది వొడాఫోన్ ఐడియా.

సవరించిన స్థూల రాబడి(ఏజీఆర్) కు సంబంధించి కట్టాల్సిన మొత్తంలో 2020-21 సంవత్సరానికి గాను 10 శాతం వెంటనే కట్టాలంటూ అన్ని టెలికాం కంపెనీలను సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మిగితా మొత్తం వచ్చే 10 సంవత్సరాల్లో ఆర్థిక సంవత్సరం 2022 నుంచి సంవత్సరానికి ఓసారి చెల్లించాల్సి ఉంటుందని సుప్రీం ఆదేశించింది.

ఇప్పటికే వొడాఫోన్ ఐడియా కేంద్ర ప్రభుత్వానికి 58,254 కోట్లు చెల్లించాలి. దాంట్లో 7854 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి డబ్బు చెల్లించలేదు. దీంతో.. ఫండ్ రైజింగ్ కు కంపెనీ మొగ్గు చూపుతోంది.

వేల కోట్ల నిధుల సేకరణ కోసం వొడాఫోన్ ఐడియా ఈకామర్స్ ధిగ్గజం అమెజాన్, వెరిజాన్ కమ్యూనికేషన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి బోర్డు మెంబర్స్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ కంపెనీలతో నిధుల సేకరణ విషయమై వొడాఫోన్ ఐడియా ఒప్పందం కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తోంది.