Vivo V30: మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ ని లాంచ్ చేసిన వివో.. తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్?

ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ వివో ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్ లు విడుదల చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి విడుదల చేస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది వివో. మరి ఆ వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్జం వివో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వి30 లైట్‌ 4జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.

ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్లో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఇదిలా ఉంటే ఇదే మోడల్‌కు సంబంధించి కొన్ని నెలల క్రితం 5జీ వెర్షన్ లాంచ్‌ కాగా తాజాగా వివో 4జీ వెర్షన్‌ను తీసుకొచ్చింది. మరి తాజాగా తీసుకువచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి ధర ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.. వివో వీ30 లైట్ 4జీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమో ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్ ఫోన్‌లో 80 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

ఇక ఈ ఫోన్‌ క్వాల్‌కం స్నాప్‌డ్రాగ్‌ 685 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను ప్రస్తుతం 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో లాంచ్‌ చేశారు. అయితే త్వరలోనే 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ను తీసుకురానున్నారు. ఇక ఈ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఇకపోతే ధర విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 22,500గా ఉండొచ్చని అంచనా. కాగ్స్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన మెయిన్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇక ఈ ఫోన్‌లో వాటర్‌ రెసిస్టెంట్ కోసం ఐపీ54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందించారు. ఈ ఫోన్‌ మందం 0.79 సెంటీమీటర్లుగా ఉంది.