ప్రతి భారతీయ పౌరుడు కి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే దేశంలో నివసించే ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఒక గుర్తింపు కార్డు. పిల్లల స్కూల్ అడ్మిషన్స్ దగ్గర నుండి మొదలు ఏ పని జరగాలన్న ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇంత ప్రాముఖ్యత కలిగిన ఆధార్ కార్డు ఉన్న వినియోగదారులు ఆధార్ కార్డు గురించి కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.ఆధార్ కార్డ్ వినియోగదారులు దానిని ఉపయోగించాలంటే అథెంటికేషన్ తప్పనిసరి. అయితే ఆధారపెండికేషన్ సమయంలో మన వివరాలు మోసగాళ్ల చేతి లో పడే అవకాశం ఉంది.
ఈ క్రమంలో యూఐడీఏఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక వాటి వివరాలని చూసేస్తే.. ఆధార్ అథెంటికేషన్ చేసే ముందు కచ్చితంగా ఆధార్ కార్డుదారుడి అనుమతి తీసుకోవాలని రిక్వెస్టింగ్ ఎంటిటీస్ (ఆర్ఈ)లకు యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆధార్ అథెంటికేషన్ చేయడానికి ముందు కార్డుదారుడి నుంచి పేపర్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో అనుమతి తీసుకోవటం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఆధార్ వివరాలు మోసగాళ్ల చేతికి చిక్కకుండా యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆధార్ అదేంటికేషన్ సమయంలో మాములుగా అయితే రిక్వెస్టింగ్ ఎన్‌టిటీస్ ఆధార్ వివరాలను మాస్కింగ్ లేకుండా ఫిజికల్ గా కానీ ఎలక్ట్రానిక్ రూపంలో నిలువ చేయవు. ఆధార్ వివరాలకి మాస్కింగ్ ఉండటం వల్ల తొలి 8 నెంబర్లు కనపడవు. అందువల్ల ఆధార్ కార్డుదారుడి అనుమతి తీసుకున్న తర్వాతే నెంబర్ ని స్టోర్ చెయ్యాలి అని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఆధార్ కార్డుదారుడి నుండి అనుమతి తీసుకోవడమేకాకుండా అలానే ఆధార్ అథెంటికేషన్ చేస్తున్నారో లేదో కూడా వారికి తెలియజేయాల్సి వుంది. అయితే అథెంటికేషన్ ట్రాన్సాక్షన్లు కొంత కాలమే చెల్లుబాటు అవుతాయి.