టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల దేశంలో మొబైల్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో యాప్స్ ఉపయోగించే వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఈ సోషల్ మీడియా యాపస్ ద్వారా ఛాటింగ్,షేరింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ సోషల్ మీడియాలో యాప్ అయిన ట్విట్టర్ ఇప్పటికే తన కస్టమర్లకు ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ప్రస్తుతం ఎలన్ మాస్క్ ట్విట్టర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్విట్టర్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. ఈ క్రమంలో ఆదాయ మార్గాల కోసం కొత్త విధానాలను తీసుకువస్తున్నారు.
తాజాగా తన యూజర్స్ కోసం బ్లూ టిక్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ట్విట్టర్ వినియోగదారులు తమ ప్రొఫైల్లో బ్లూటిక్ పొందాలంటే 900 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ట్విట్టర్ ప్రొఫైల్ లో ఈ బ్లూటిక్ ఉండటం వల్ల అది నిజమైన ప్రొఫైల్ అని చెప్పేందుకు ఉపయోగపడుతుంది. ఇక ఇప్పటివరకు ట్విట్టర్ ప్రీమియం ట్విట్టర్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ (Twitter Premium Subscription) సేవలు కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు మన దేశంలో కూడా ఆ సేవలు ప్రారంభించింది.
రూ. 900 చెల్లించి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవటం వల్ల ప్రొఫైల్ కు బ్లూ టిక్ మార్క్ ఒక్కటే కాకుండా.. పెద్ద పోస్ట్ లు పెట్టుకోవచ్చు. అయితే ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసిన 90 రోజులు తర్వాతనే ఈ బ్లూ టిక్ మార్క్ పొందే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ట్విట్టర్ కొత్తగా తీసుకొచ్చే ఫీచర్లను ముందుగా వినియోగించుకోవచ్చు. అంతే కాకుండా ట్వీట్ పెట్టిన తర్వాత 30 నిమిషాల్లోపు ఐదు సార్లు ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే వీడియోలను పూర్తి రిజల్యూషన్ తో షేర్ చేసుకోవచ్చు.