ఈ పోస్టు ఆఫీస్ స్కీమ్ ద్వారా రూ. 100 చెల్లించి రూ. 14 లక్షలు సొంతం చేసుకోండిలా?

పోస్ట్ ఆఫీస్ అందించే వివిధ రకాల పథకాల ద్వారా ప్రజలకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారా తక్కువ పెట్టుబడి పెట్టి… ఎక్కువ రాబడి పొందవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్ లో ఉన్న ఒక స్కీం ద్వారా వంద రూపాయలు చెల్లించి 14 లక్షలు రాబడి పొందే అవకాశం కూడా ఉంది. ఆ స్కిమ్ పూర్తీ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్ట్ ఆఫీస్ లో ఉన్న సుమంగల్ రూరల్ లైఫ్ అనే ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా అధిక లాభం ఉంటుంది. ఈ స్కీం ద్వారా చిన్న మొత్తంలో డబ్బులు పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో రాబడి పొందవచ్చు. ఈ సుమంగల్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం ద్వారా రూ. 14 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఈ స్కీం లో రెండు మెచ్యూర్ పీరియడ్లు ఉంటాయి. ఒకటి 15, మరొకటి 20 సంవత్సరాలుగా ఉంటుంది. వీటిలో 15 ఏళ్ల మెచ్యూర్ పిరియడ్ పాలసీని ఎంచుకున్నట్లయితే 6,9,12 సంవత్సరాల్లో పాలసీ మొత్తంలో 20 శాతం చొప్పున ఇస్తారు. అదే 20 ఏళ్ల పాలసీ ఎంచుకుంటే 8,12,16 సంవత్సరాల్లో పాలసీ మొత్తం 20 శాతం చొప్పున ఇస్తారు. మిగిలిన 40 శాతం, బోనస్‌తో మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయాక ఇస్తారు.

ఈ సుమంగల్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం లో చేరటానికి19 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన భారతీయ పౌరుడు అయ్యి ఉండాలి. ఈ స్కీం లో రోజుకి 95 రూపాయల చొప్పున కడితే లక్షల్లోలాభం వస్తుంది. 25 వయసున్న వ్యక్తి 20 ఏళ్ల పాలసీని తీసుకుని ప్రతిరోజు 95 రూపాయలు చొప్పున నెలకు రూ. 2850 చొప్పున మెచ్యూరిటీ పీరియడ్ అయ్యే వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మెచ్యూరిటీ పీరియడ్ పూర్తి అయ్యే వరకు రోజుకు 95 రూపాయలు చొప్పున చెల్లించటం వల్ల చివరికి రూ. 14 లక్షల వరకు డబ్బు తిరిగి ఇస్తారు. 20 ఏళ్ల పాలసీని సెలక్ట్ చేస్తే 20 శాతం చొప్పున 8,12,16 సంవత్సరాల్లో రూ.1.4 లక్షల రూపాయల చొప్పున డబ్బు చెల్లిస్తారు. ఇలా 20వ సంవత్సరం 40 శాతం అంటే 2.8 లక్షల రూపాయలు. మొత్తం 7 లక్షల రూపాయలు బోనస్ ఉంటుంది. ఇది సంవత్సరానికి రూ.48 వేల చొప్పున ఉంటుంది. ఇరవై ఏళ్ళల్లో 6.72 లక్షలు. అంటే మొత్తంగా 13.72 లక్షలు మనం తిరిగి పొందవచ్చు.