మీ డబ్బులను డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా.. కేంద్రం అందిస్తున్న బెస్ట్ స్కీమ్ ఇదే!

మనలో చాలామంది వేర్వేరు స్కీమ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తూ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందాలని భావిస్తూ ఉంటారు. అయితే సరైన విధంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే దీర్ఘకాలంలో లాభాలను పొందవచ్చు. మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులకు రెట్టింపు మొత్తం పొందాలని చాలామంది భావిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఒక స్కీమ్ ను అమలు చేస్తోంది.

కిసాన్ వికాస్ పత్ర పేరుతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు 7.5 శాతం చక్రవడ్డీ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో నిర్ధిష్ట కాలంలో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా రెట్టింపు డబ్బును పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎలాంటి నష్ట భయం లేని స్కీమ్ కావడంతో ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

కనీసం 1000 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉండగా 9 సంవత్సరాల 7 నెలలకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మెచ్యూరిటీ తర్వాత ఎక్కువ మొత్తం పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. పోస్టాఫీస్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన అకౌంట్ ను ఓపెన్ చేయవచ్చు.

అకౌంట్ ను ముందే ముగించాలని అనుకుంటే కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులను గుర్తుంచుకోవాలని ఎవరైనా అకౌంట్ ను ముందుగానే కోజ్ చేయాలని అనుకుంటే ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిదని తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ లభించే ఛాన్స్ అయితే ఉంటుంది.