పోస్టాఫీస్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ లో కిసాన్ వికాస్ స్కీమ్ కూడా ఒకటి. పెట్టిన పెట్టుబడికి కొద్ది రోజుల్లోనే డబుల్ ఆదాయం పొందాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. కనీసం 1000 రూపాయలతో ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఉండగా ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్లు ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయడం ద్వారా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవచ్చు.
ఈ స్కీమ్ లో గరిష్ట పరిమితి లేకపోవడంతో జాయింట్ అకౌంట్ ను కూడా ఓపెన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో డిపాజిట్ చేయడానికి అర్హులు కాగా మొత్తం 115 నెలలపాటు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత 10 లక్షల రూపాయలను 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లు పొందే అవకాశం అయితే ఉంటుంది.
స్థానికంగా ఉన్న పోస్టాఫీస్‌లో ఈ అకౌంట్ ను ఓపెన్ చేసే ఛాన్స్ ఉండగా చెక్, నగదు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డబ్బులను డిపాజిట్ చేయవచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం వడ్డీ రేటును సమీక్షిస్తున్న నేపథ్యంలో వడ్డీ రేట్లకు సంబంధించి స్వల్పంగా మార్పులు ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుత కాలంలో సేవింగ్స్ ఎంతో ముఖ్యం కాగా ఈ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే ఎంతో మేలు చేకూరుతుంది.
ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రభుత్వం వడ్డీ రేట్ల విషయంలో మార్పులు చేస్తుండటంతో పెట్టుబడులు పెట్టేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఎక్కువ మొత్తం పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు.