భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. మనం ఏ పని చేయాలన్నా కూడా ఆధార్ నెంబర్ తప్పనిసరిగా మారింది. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ ఆధార్ కార్డుని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. మన ఫోటో, అడ్రస్, ఫోన్ నెంబర్ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయకపోవడం వల్ల మనం ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. అందువల్ల 10 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డు పొందినవారు ఒక్కసారి కూడా అప్డేట్ చేయకపోతే వెంటనే ఫోటో, అడ్రస్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ని వెంటనే అప్డేట్ చేయటం మంచిది. అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేయడం కోసం ఆధార్ సెంటర్ కి వెళ్లి గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారానే ఆధార్ కార్డు అప్డేట్ చేయవచ్చు. ఆన్లైన్ ద్వారా ఆధార్ కార్డు అప్డేట్ చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆన్‌లైన్ ద్వారా ఆధార్ అప్‍డేట్ :
• ఆన్లైన్ లో ఆధార్ కార్డు వివరాలు అప్డేట్ చేయటానికి ముందుగా https://myaadhaar.uidai.gov.in/ లింక్ ఓపెన్ చేయాలి.
• ఆ తర్వాత అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
• లాగిన్ అయిన తర్వాత Online Update Services పైన క్లిక్ చేయాలి.
• ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేసి Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
• ఆ తర్వాత అక్కడ ఉన్న పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేసి మీరు అప్డేట్ చేయాలనుకున్న పూర్తీ వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి.
అలాగే ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు ఆధార్ అప్‌డేట్ కోసం ఇవే స్టెప్స్ ఫాలో కావచ్చు. పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలు కాకుండా మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, రిలేషన్‌షిప్ స్టేటస్, ఐరిస్, ఫింగర్‌ప్రింట్, ఫోటో అప్‌డేట్ చేయాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది.