నేషనల్ కెమికల్ లాబొరేటరీలో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. అత్యంత భారీ వేతనంతో?

నేషనల్ కెమికల్ లాబొరేటరీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అధికారిక వెబ్ సైట్ ద్వార ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ncl-india.org వెబ్ సైట్ ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.

జూన్ నెల 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండి నాలుగేళ్ల అనుభవం లేదా ఎంటెక్ డిగ్రీతో రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అభ్యర్థులు 2 సంవత్సరాల అనుభవంతో గ్రాడ్యుయేట్ డిగ్రీని తప్పనిసరిగా కలిగి ఉండాలని సమాచారం అందుతోంది.

సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ కు 40 సంవత్సరాల వయస్సు అర్హత కాగా ప్రాజెక్ట్ అసోసియేట్1 ఉద్యోగ ఖాళీలకు 35 సంవత్సరాల వయస్సు వయోపరిమితిగా ఉంది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ కు హెచ్.ఆర్.ఏతో పాటు 42,000 రూపాయల వేతనం లభించనుండగా ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఉద్యోగ ఖాళీలకు రూ. 25,000 నుండి రూ. 31,000 వరకు వేతనం లభించనుందని తెలుస్తోంది.

ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. నేషనల్ కెమికల్ లాబొరేటరీ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుంది. ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండనుంది.