కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో భారీ సంఖ్యలో జాబ్స్.. నెలకు 1,40,000 వేతనంతో?

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. నవీ ముంబైలోని ప్రభుత్వ రంగ సంస్థ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 214 ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జూన్ 12న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2024 సంవత్సరం జులై2 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉండనుంది.

డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ పాసైన వాళ్లు, అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. జూనియర్‌ కమర్షియల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగ ఖాళీలు 120 ఉండగా 50 శాతం మార్కులతో బీఎస్సీ అగ్రికల్చర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు కనీసం 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

జూనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌) ఉద్యోగాలకు 50 శాతం మార్కులతో బీకాం డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు కనీసం 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. -జూనియర్‌ అసిస్టెంట్‌ (జనరల్‌) ఉద్యోగ ఖాళీలు 20 ఉండగా బీఎస్సీ అగ్రికల్చర్‌ డిగ్రీ 50 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (అకౌంట్స్‌) ఉద్యోగాలు 20 ఉండగా సీఏ లేదా సీఎంఏ పాస్ అయిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (మార్కెటింగ్‌) ఉద్యోగాలు 11 ఉండగా అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ/ ఎంబీఏతో సమానమైన వ్యవసాయ సంబంధిత మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

జూనియర్‌ అసిస్టెంట్‌ (హిందీ ట్రాన్స్‌లేటర్‌) ఒకే ఒక ఉద్యోగం ఉండగా హిందీ, ఇంగ్లీష్ ట్రాన్స్ లేషన్ తెలిసిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 కాగా మిగతా వాళ్లకు దరఖాస్తు ఫీజు 1500 రూపాయలుగా ఉండనుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.