మీ పాన్ కార్డు పై ఫోటో క్లారిటీగా లేదా… అయితే ఇలా చేసి కొత్త ఫోటో మార్చవచ్చు?

ప్రస్తుత కాలంలో ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఎంత అవసరమో పాన్ కార్డు కూడా అంతే అవసరం. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా పాన్ కార్డు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు లావాదేవీలను జరపటానికి పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అంతే కాకుండా బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయడం నుంచి లావాదేవీలు జరపడంతో వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు జరపటానికి కూడా పాన్ కార్డు చాలా అవసరం. అయితే కొంతమంది పాన్‌ కార్డుల్లో వారి ఫోటో స్పష్టంగా కనిపించదు. అలా ఫోటో క్లారిటీగా లేకపోవడం వల్ల కొన్ని సందర్భాలలో సమస్యలు ఎదురవుతాయి.

అలాంటి సమయంలో పాన్‌ కార్డ్ మీద ఉన్న మీ ఫోటోను మార్చుకునే అవకాశం కూడా ఉంది. మీరు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ లో ఫోటోని మార్చుకోవడమే కాకుండా పాన్ కార్డుపై ఉన్న మీ సంతకాన్ని కూడా మార్చుకోవచ్చు. అయితే పాన్ కార్డు పై ఫోటో సంతకం మార్చుకోవటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం .

• మీ పాన్ కార్డ్‌లోని ఫోటో మార్చడానికి ముందుగా NSDL అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.

• ఇప్పుడు మీకు అప్లై ఆన్‌లైన్, రిజిస్టర్డ్ యూజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీరు అప్లికేషన్ టైప్ ఆప్షన్‌కి వెళ్లి పాన్‌లో మార్పులు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి.
• ఆ తర్వాత ఫోటో మార్పుకు సంబంధించిన ఆప్షన్‌ను ఎంచుకుని అందులో అడిగే వివరాలను నమోదు చేయాలి.

• ఆ తర్వాత, కస్టమర్ క్యాప్చా కోడ్‌ తో పాటు కేవైసీని పూర్తి చేయాలి.
,
• ఇప్పుడు మీరు స్క్రీన్‌పై రెండు ఆప్షన్స్‌ కనిపిస్తాయి. సిగ్నేచర్ సరిపోలడం, ఫోటో సరిపోలలేదు వంటి ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఇలా ఫోటో మార్చుకోవాలి అనుకునేవారు లేదా అడ్రస్ మార్చుకోవాలి అనుకునేవారు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి

• దీని తర్వాత మీరు కోరిన ID రుజువును సమర్పించి, డిక్లరేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

• ఫోటోను ఆన్‌లైన్‌లో మార్చుకోవడానికి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రుసుము చెల్లింపును పూర్తి చేసిన తర్వాత ఫోటో మార్చే ప్రక్రియ పూర్తవుతుంది

• ఇప్పుడు చివరకు మీరు రసీదును పొందుతారు. దీని తర్వాత మీరు ఫోటోను మార్చడానికి నింపిన ఫారమ్ ప్రింటవుట్ తీసుకోవచ్చు. దానిని ఇన్‌కమ్ ట్యాక్స్ పాన్ సర్వీస్ యూనిట్‌కి పంప ఫోటో మార్చుకోవచ్చు.