రూ.5,000 కంటే తక్కువ మొత్తానికి అదిరిపోయే ఫోన్ కావాలా.. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్లు ఇవే!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎంత మంచి స్మార్ట్ ఫోన్ ఉంటే సమాజంలో అంత విలువ ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. కొన్ని కంపెనీలు తక్కువ మొత్తానికి అదిరిపోయే ఫోన్ అందిస్తున్నాయి. 5,000 రూపాయల కంటే తక్కువ మొత్తానికి కూడా మార్కెట్ లో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ కంపెనీ ద్వారా తక్కువ మొత్తానికి కూడా స్మార్ట్ ఫోన్లను కొనవచ్చు.

ఐకాల్ k555 టప్ 4జీ స్మార్ట్ ఫోన్ ధర కేవలం 2,999 రూపాయలు కావడం గమనార్హం. మీడియాటెక్ 6739 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పని చేస్తుంది. 16 జీబీ స్టోరేజ్, 2జీబీ రామ్ తో పని చేసే ఈ ఫోన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ వంటి ముఖ్యమైన యాప్స్ ను ఉపయోగించవచ్చు.

నోకియా 2660 ఫ్లిప్ మొబైల్ ధర కేవలం 4299 రూపాయలు కావడం గమనార్హం. మీడియాటెక్ చిప్ సెట్ తో ఈ ఫోన్ పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన వాళ్లు ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఐటెల్ a23s ఫోన్ ధర ఇండియాలో రూ.4799గా ఉంది. 15 ఇండియన్ భాషలకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. జియో భారత్ కార్బన్ ఏ1 మొబైల్ 1499 రూపాయలకే అందుబాటులో ఉంది.

ఈ ఫోన్ లో జియో సినిమా యాప్ కూడా ఉంది. తక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఈ విధంగా చేస్తే మంచిదని చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడం తప్పనిసరి అని భావించే వాళ్లు ఈ స్మార్ట్ ఫోన్లపై దృష్టి పెడితే బాగుంటుందని చెప్పవచ్చు. ఈ ఫోన్లను కొనుగోలు చేయాలని భావించే వాళ్లు స్పెసిఫికేషన్లు నచ్చితే మాత్రమే ఫోన్లను కొనుగోలు చేస్తే మంచిది.