మనలో చాలామంది సంవత్సరాల తరబడి ఒకే నంబర్ ను వినియోగిస్తుంటే కొంతమంది మాత్రం ఆఫర్లు, ఇతర కారణాల వల్ల తరచూ ఫోన్ నంబర్లను మారుస్తూ ఉంటారు. అయితే దేశంలో ప్రస్తుతం ప్రముఖ టెలీకాం కంపెనీలు కేవలం 4 మాత్రమే ఉండగా సిమ్ కార్డులను కొనుగోలు చేసే ప్రక్రియ సులువుగా, సురక్షితంగా జరిగేలా టెలీ కమ్యూనికేషన్స్ విభాగం కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది.
కొత్త రూల్స్ వల్ల ఇకపై సిమ్ కొనుగోలు ప్రక్రియ పూర్తిస్థాయిలో పేపర్ లెస్ గా మారే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. వినియోగదారులు సిమ్ కార్డుల వల్ల మోసపోయే అవకాశమే లేకుండా నిబంధనల్లో కీలక మార్పులు జరిగాయని తెలుస్తోంది. కొత్త నిబంధనల ద్వారా ఆన్ లైన్ ద్వారానే సులువుగా సిమ్ కార్డ్ ను కొనుగోలు చేసే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.
డిజిటల్ ఇండియాలో భాగంగా ఇకపై పేపర్‌లెస్ సిమ్ కొనుగోలు ప్రక్రియను అందుబాటులోకి తీసుకొనిరానున్నారు. టెలీకాం ఆపరేటర్ కార్యాలయంతో సంబంధం లేకుండానే ఈ కేవైసీ ధృవీకరణ సైతం పూర్తి కానుంది. అయితే కొత్త సిమ్ కార్డ్ ను కొనుగోలు చేసే వినియోగదారులు ఆధార్ ను ఉపయోగించి మాత్రమే సిమ్ కార్డ్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ల ధ్రువీకరణ డిజీ లాకర్ ద్వారా ఆన్ లైన్ లోనే పూర్తి కానుంది.
టెలికాం ఆపరేటర్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేకుండానే ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ సేవల మధ్య మారడానికి అవసరం ఉంటుందని చెప్పవచ్చు. వన్ టైమ్ పాస్ వర్డ్ ద్వారా గుర్తింపును సులువుగా ధృవీకరించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేసేవాళ్లు ఈ నిబంధనలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.