మరొక నాలుగు రోజులలో 2022వ సంవత్సరం పూర్తి కానుంది.ఇలా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో ఎంతోమంది ఈ ఏడాది పూర్తి చేయాల్సిన బ్యాంకు పనులన్నీటిని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే కొత్త ఏడాది జనవరి నెలలో ఎవరైనా బ్యాంకు పనులు చేయాలనుకుంటున్నా వారు ముందుగా జనవరి నెలలో ఏ ఏ తేదీలలో బ్యాంకు సెలవులు ప్రకటించారు తెలుసుకొని పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.
వచ్చేయడాది జనవరి నెలలో ఏకంగా 14 రోజులపాటు బ్యాంక్ మూతపడునుంది.ఇలా నెలలో 14 రోజులపాటు బ్యాంకుకు సెలవులు రావడంతో కస్టమర్లకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పాలి. అయితే 14 రోజులపాటు బ్యాంకుకు సెలవులు కావడంతో ఏ ఏ రోజు సెలవులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం…
*జనవరి 1- న్యూ ఇయర్, ఆదివారం కనుక అన్ని చోట్ల సెలవే.
*జనవరి 2- మిజోరామ్ లో బ్యాంకులు క్లోజ్.
*జనవరి 3- ఇంఫాల్ లో బ్యాంకులు క్లోజ్.
*జనవరి 5- గురు గోబింద్ సింగ్ జయంతి కారణంగా హర్యానా, రాజస్థాన్ లో సెలవులు.
*జనవరి 8- ఆదివారం అన్ని చోట్ల సెలవే.
*జనవరి 14- మకర సంక్రాంతి, రెండవ శనివారం.
*జనవరి 15- కనుమ, ఆదివారం అన్ని చోట్ల సెలవే.
*జనవరి 22- ఆదివారం అన్ని చోట్ల సెలవే.
*జనవరి 23- నేతాజీ సుబాష్ చంద్రబోస్ జయంతి కారణంగా త్రిపుర, పశ్చిమ బెంగాల్ లో బ్యాంకులు పని చేయవు.
*జనవరి 25- రాష్ట్ర దినోత్సవం కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులు క్లోజ్.
*జనవరి 26- గణతంత్ర దినోత్సవం కారణంగా అన్ని రాష్ట్రాలకు సెలవు.
*జనవరి 28- నాల్గవ శనివారం అన్ని చోట్ల సెలవే.
జనవరి 29-ఆదివారం అన్ని చోట్ల సెలవే.