ఆ బ్యాంకు కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఆర్బిఐ.. కస్టమర్లు ఇకపై పూర్తి డబ్బు డ్రా చేయలేరు..?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) తాజాగా ఒక బ్యాంకు కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఆర్బిఐ ఆ బ్యాంకు పై ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఆ బ్యాంకు కస్టమర్లు తమ అకౌంట్ నుండి పూర్తి మొత్తంలో డబ్బు డ్రా చేయటానికి వీలు లేకుండా పోయింది. ఆర్బిఐ నిర్దేశించిన మొత్తాన్ని మాత్రమే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో కస్టమర్లకు సడలింపు ఉంటుంది. ఆర్.బి.ఐ ఆంక్షలు విధించిన ఆ బ్యాంకు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ముసిరి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై ఆర్‌బీఐ తాజాగా ఆంక్షలు విధించింది. బ్యాంక్ ఆర్థిక పరిస్థితులు దిగజారి పోవడం ఇందుకు ప్రధాన కారణంగా ఆర్బిఐ వెల్లడించింది. ఈ బ్యాంకులో ఆరు నెలల పాటు ఆంక్షలు అమలులో ఉంటాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. అలాగే బ్యాంక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తామని, అందుకు అనుగుణంగా ఆంక్షల సడలింపు ఉండొచ్చని తెలిపింది. అయితే రిజర్వు బ్యాంక్‌ ఆంక్షలు విధించటం తో కాస్తమర్లు అనేక అవస్ధలు పడుతున్నారు.

ఈ బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు తమ అకౌంట్ నుండి కేవలం రూ. 5 వేలు మాత్రమే విత్‌డ్రా చేయటానికి ఆర్బిఐ అనుమతించింది. అంతేకాకుండా ఆర్‌బీఐ అనుమతి లేకుండా బ్యాంక్ కస్టమర్లకు రుణాలు ఇవ్వకూడదు. అలాగే ఇతర ఏ ఇన్వెస్ట్‌మెంట్లు చేయకూడదు. ఇంకా పేమెంట్లు చేయటం, ప్రాపర్టీలను విక్రయించడం వంటివి చేయకూడదు. బ్యాంక్ ఏ పని చేయాలన్నా కచ్చితంగా ఆర్‌బీఐ నుంచి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కస్టమర్ల డబ్బుకి ఎలాంటి ఢోకా లేదని ఆర్బీఐ తెలిపింది.

డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కింద రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ లభిస్తుందని వెల్లడించింది. అంటే బ్యాంక్ అకౌంట్‌లో రూ. 5 లక్షల వరకు కలిగిన వారికి ఇబ్బంది లేదు. పూర్తి డబ్బులు వెనక్కి వస్తాయి. అలాగే ఎవరైనా ఎఫ్‌డీలో రూ. 5 లక్షలు దాచుకున్నా కూడా పూర్తి డబ్బులు పొందొచ్చు. అయితే రూ. 5 లక్షలు కన్నా ఎక్కువ ఉన్న వారికి మాత్రం కేవలం రూ. 5 లక్షలు వస్తాయి. అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారు ఇలాంటి విషయాలను గుర్తించుకోవాలి. ఈ బ్యాంక్ లో రూ. 5 లక్షల వరకే డబ్బులు ఎఫ్‌డీ చేసుకోవడం ఉత్తమం. ఎక్కువ డబ్బులు ఉంటే వేరే బ్యాంక్‌లో లేదంటే మీ భాగస్వామి పేరుతో ఆ డబ్బులను ఎఫ్‌డీ చేసుకోవడం మంచిది.