ఇల్లు కట్టుకోవడానికి హోమ్ లోన్ పొందాలనుకుంటున్నారా.. అవసరమైన డాక్యుమెంట్లు ఇవే!

మన దేశంలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో ఇల్లు అన్ని సౌకర్యాలతో నిర్మించుకోవాలంటే కనీసం కోటి రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కువ మొత్తం వేతనం వచ్చే వ్యక్తులు అయినా పెరుగుతున్న ప్రాపర్టీ ధరల వల్ల బ్యాంకులో లోన్ తీసుకోకుండా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. కొన్ని పత్రాలను కలిగి ఉండటం ద్వారా హోమ్ లోన్ సులువుగా పొందవచ్చు.

హోమ్ లోన్ పొందాలంటే భూమి మీ పేరుపై రిజిష్టర్ అయిందని ప్రూవ్ చేసుకోవాలి. పూర్వీకుల భూమిలో ఇంటిని నిర్మిస్తుంటే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ ను అందించాల్సి ఉంటుంది. ఎవరైనా ఈ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేస్తే ఆ భూమిపై ఎలాంటి వివాదాలు లేవని క్లారిటీ వస్తుంది. ఆదాయ రుజువును కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అన్ని పత్రాలను చూపించిన తర్వాత మాత్రమే రుణం మంజూరు అవుతుంది.

హోమ్ కన్ స్ట్రక్షన్ లోన్ ను పొందాలని భావించే వాళ్లు దశల వారీగా ఈ లోన్ ను పొందవచ్చు. ఇంటి నిర్మాణం ప్రారంభించిన తర్వాత మాత్రమే హోమ్ లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎల్.ఐ.సీ హోమ్ ఫైనాన్స్ 30 సంవత్సరాల పాటు 9.10 శాతం వడ్డీ రేటుతో రుణం అందిస్తోంది. బ్యాంక్ వడ్డీ రేట్లు సైతం దాదాపుగా ఇదే విధంగా ఉంటాయని చెప్పవచ్చు.

ఇంటి ఖర్చులో 80 నుంచి 85 శాతం లోన్ రూపంలో పొందే అవకాశం అయితే ఉంటుంది. సిబిల్ స్కోర్ బాగుంటే మాత్రమే సులువుగా హోమ్ లోన్ ను పొందవచ్చు. హోమ్ కన్ స్ట్రక్షన్ లోన్ ను పొందాలని భావించే వాళ్లు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.