కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఆ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. మోదీ ప్రభుత్వం రైతుల కోసం నెలకు 6000 రూపాయల చొప్పున అందిస్తున్న సంగతి తెలిసిందే. మహిళలకు ప్రయోజనం కలిగేలా కేంద్రం ఉద్యోగిని యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.
బిజినెస్ చేయాలని భావించే మహిళలు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటే మహిళలకు బ్యాంక్ నుంచి రుణం లభిస్తుంది. 3 లక్షల రూపాయల వరకు రుణం లభించనుండగా ఈ స్కీమ్ ద్వారా లభించే రుణంలో 30 శాతం వరకు సబ్సిడీ లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. 55 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళలు ఈ స్కీమ్ కు అర్హులు.
కొన్ని షరతులకు అంగీకరిస్తే ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. కుటుంబ వార్షికాదాయం లక్షన్నర లోపు ఉంటే ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ బ్యాంక్ నుంచి అయినా ఈ స్కీమ్ కోసం రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న మహిళలు ఈ స్కీమ్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుని లోన్ తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు.